ప్రస్తుత కాలంలో బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు సక్సెస్ కావడమే కష్టమైతే ఆ హీరోలు స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవడం మరింత కష్టమని చెప్పవచ్చు.అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన ప్రతిభతో స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.
అయితే విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసి హిట్లైన సినిమాలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండటం గమనార్హం.
కొన్ని సినిమాలను కథ నచ్చక విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేస్తే మరికొన్ని సినిమా సినిమాల కథలు నచ్చినా డేట్స్ కుదరక, ఇతర కారణాల వల్ల విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేయడం జరిగింది.
వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన భీష్మ, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఇస్మార్ట్ శంకర్, ఆర్.ఎక్స్ 100, ఉప్పెన సినిమాలను విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశారు.ఈ సినిమాలలో నటించి ఉంటే విజయ్ దేవరకొండ రేంజ్ మరింత పెరిగేది.
ఈ సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ ను కూడా వదులుకున్నారు.

కథ నచ్చక పలు సందర్భాల్లో విజయ్ దేవరకొండ స్టార్ డైరెక్టర్ల సినిమాలను సైతం రిజెక్ట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి.లైగర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కడంతో విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ కూడా ఊహించని స్థాయిలో పెరిగింది.ఈ సినిమాకు విజయ్ దేవరకొండ పారితోషికం 25 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

మిడిల్ రేంజ్ హీరోలలో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో విజయ్ దేవరకొండ మాత్రమే కావడం గమనార్హం.లైగర్ సినిమా కోసం హిందీ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటే విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోతుందని చెప్పవచ్చు.
విజయ్ దేవరకొండ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.







