ఆ కారణంగానే కొరటాల ప్రాజెక్ట్ కి నో చెప్పిన విజయ్

టాలీవుడ్ యంగ్ హీరోలలలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదని చెప్పాలి.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో లైగర్ సినిమాని విజయ్ దేవరకొండ చేస్తున్నాడు.

ఈ సినిమా మీద ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో మంచి హైప్ ఉంది.డాషింగ్ డైరెక్టర్ పూరీ కూడా ఈ సినిమాని మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు.

దానికోసం ఇప్పటి వరకు ఏ సినిమాకి తీసుకోనంత సమయం తీసుకుంటున్నారు.బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, మలయాళీ స్టార్ సురేష్ గోపి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ని రంగంలోకి దించారు.ఇదిలా ఉంటే రీసెంట్ గా కొరటాల శివతో సినిమాని విజయ్ దేవరకొండ రిజక్ట్ చేశాడు.

Advertisement

దీనిపై టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.కొరటాల తన ఫ్రెండ్ ని నిర్మాతగా పరిచయం చేస్తూ హోం బ్యానర్ లో యువసుధ స్టార్ట్ చేశాడు.

ఈ బ్యానర్ లో వెంకీ కుడుముల దర్శకత్వంలో విజయ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.దీనికోసం అతన్ని సంప్రదిస్తే చేయలేనని చెప్పాడు.

విజయ్ కొరటాల ప్రాజెక్ట్ ని రిజక్ట్ చేయడానికి కాల్ షీట్స్ సమస్య అని తెలుస్తుంది.లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.అలాగే సుకుమార్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియాకి కమిట్ అయ్యాడు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

దీంతో పాటు దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు.ఈ మూడు సినిమాలు పూర్తి కావాలంటే మరో రెండేళ్ళు పడుతుంది.

Advertisement

ఈ కారణంగా కొరటాల సినిమాని విజయ్ రిజక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

తాజా వార్తలు