దేవరకొండలో ఆ జోరు కనిపించడం లేదు ఎందుకో?

గీత గోవిందం మరియు డియర్‌ కామ్రేడ్‌ చిత్రాల విడుదల సమయంలో విజయ్‌ దేవరకొండ చూపించిన స్పీడ్‌ అంతా ఇంతా కాదు.

అర్జున్‌ రెడ్డి నుండే ఆయన యమ స్పీడ్‌గా జోరుగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు.

అలాంటిది ఇప్పుడు మాత్రం ఆ జోరు కనిపించడం లేదు.విజయ్‌లో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏంటీ అంటూ విజయ్‌ దేవరకొండ అభిమానులు సైతం జట్టు పీక్కుంటున్నారు.

వచ్చే వారంలో విజయ్‌ దేవరకొండ నటించిన వరల్డ్‌ ఫేమస్‌ అవర్‌ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.ఆ సినిమా ప్రమోషన్స్‌ విషయాన్ని అసలు విజయ్‌ దేవరకొండ పట్టించుకుంటున్నట్లుగా లేడు.మొన్నటి వరకు ముంబయిలో లైగర్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొని వచ్చిన విజయ్‌ ఇటీవల ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో కనిపించాడు.

ఆ తర్వాత మళ్లీ సినిమా గురించి ఆయన పోస్ట్‌లు పెట్టడం కాని, మాట్లాడటం కాని చేసిందేమీ లేదు.

Advertisement

ఇక విజయ్‌ దేవరకొండకు ఈ చిత్రంపై ఆసక్తి లేదని, సినిమా తప్పకుండా ప్లాప్‌ అవుతుందనే నమ్మకంను ఆయన కలిగి ఉన్నాడని, అందుకే ఇలా ప్రమోషన్స్‌ విషయంలో పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ఫ్లాప్‌ అయ్యే సినిమాకు ఎంత పబ్లిసిటీ చేస్తే ఏం లాభం అని చూస్తున్నాడా లేదంటే ఈ సినిమాకు ఆయన తీసుకున్న పారితోషికం కొంచెమే కనుక ఆ మేరకే ప్రమోషన్స్‌కు హెల్ప్‌ చేస్తున్నాడా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు