రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కి చాలా అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
ఏమాత్రం సినిమా ఆకట్టుకునే విధంగా లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరస్తున్నారు.సినిమా కు సంబంధించిన ప్రతి విషయం కూడా నిరాశపరిచే విధంగా ఉందంటున్నారు.
ఇదే సమయం లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రాబడుతున్న వసూళ్ల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది.సినిమా కు నెగెటివ్ టాక్ వచ్చిన కూడా భారీ వసూలు నమోదు అవుతున్నాయి అంటూ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పాతిక కోట్ల వరకు రాబట్టింది అంటూ యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రకటనలు చర్చనీయాంశంగా మారాయి.లైగర్ సినిమా భారీ ఎత్తున వసూలు చేసే అంత సీన్ లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన విషయం లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని చిత్ర యూనిట్ సభ్యులు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ట్రేడ్ వర్గాల వారు కొందరు సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఈ విషయం లో మౌనంగా ఉన్నాడు అంటే కచ్చితంగా యూనిట్ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు నిజం అయ్యి ఉండక పోవచ్చు అంటున్నారు.ఈ సినిమా బాలీవుడ్లో దాదాపు గా రూ.6 కోట్ల వసూలను నమోదు చేసింది అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించారు.కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని ఖచ్చితంగా అది అబద్దం అయ్యుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు కూడా అభిప్రాయం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది విజయ్ దేవరకొండ స్పందిస్తే తేలవలసి ఉంది.







