తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.ఇక విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి నటుడు మీడియం రేంజ్ హీరోగా ముందుకు సాగుతున్నప్పటికి తొందర్లోనే ఆయన స్టార్ హీరో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక రీసెంట్ గా వచ్చిన ‘కింగ్ డమ్’ సినిమా( Kingdom Movie ) టీజర్ ని కనుక మనం అబ్సర్వ్ చేసినట్లయితే ఈ టీజర్ లో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడు.ఎట్టకేలకు ఆయన చేసిన ఈ సినిమా మాత్రం భారీ విజయాన్ని సాధిస్తుందనే ఒక గొప్ప కాన్ఫిడెంట్ తో ఆయన ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన వరుస సినిమాలు డిజాస్టర్ బాట పడుతున్నాయి.

మరి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధిస్తే ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు రావడమే కాకుండా ఆయనను మించిన హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరనే అంతలా గుర్తింపును కూడా పొందుతాడు.మరి ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటున్నాయి.ఇక కింగ్ డమ్ టీజర్( Kingdom Teaser ) అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది.కాబట్టి ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుంది.

కాబట్టి విజయ్ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించబోతున్నాడనే అభిప్రాయాలు కూడా వెలవడుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగాలనుకోవడం విశేషం…ఇక పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…ఒకవేళ భారీ విజయాలను అందుకుంటే మాత్రం తనను మించిన నటుడు మరొకరు ఉండరు అనేది వాస్తవం…
.







