మాజీ డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బర్డ్( Tulsi Gabbard ) పేరు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో మారుమోగిపోతోంది.ఎందుకంటే ఆమెను ఏకంగా దేశపు గూఢచారి విభాగం చీఫ్‌గా( US Intelligence Chief ) నియమించారు.
అమెరికా జాతీయ నిఘా విభాగానికి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్( DNI ) గా ఆమె నియామకాన్ని సెనేట్ బుధవారం ఆమోదించింది.ఓటింగ్‌లో 52-48 తేడాతో ఆమె గెలుపొందారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) స్వయంగా తులసికి మద్దతు పలకడం విశేషం.దీంతో ఆమె ఒక్కసారిగా 18 నిఘా సంస్థల పనులను పర్యవేక్షించే అత్యున్నత స్థానానికి చేరుకున్నారు.
ఈ నియామకం మామూలు విషయం కాదు.ఇది ఒక పెద్ద రాజకీయ మలుపు అంటున్నారు విశ్లేషకులు.తులసి గబ్బర్డ్ పేరు వింటేనే చాలా మందికి మంటెక్కుతాయి.అంతలా ఆమె అమెరికా రాజకీయాల్లో ఒక వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు.
అమెరికా విదేశాంగ విధానంపై ఆమెకున్న అభిప్రాయాలు చాలా స్ట్రాంగ్.పైగా ఆమె డెమోక్రటిక్ పార్టీని 2022లోనే వదిలేశారు.
పార్టీ నాయకత్వం సరిగ్గా లేదని దుమ్మెత్తిపోశారు.ఇది చాలదన్నట్లు, తులసికి భారతదేశం అంటే అభిమానం.
హిందూ అమెరికన్లకు ఆమె అండగా ఉంటారు.

ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ( PM Modi ) రెండు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన వేళ, తులసి గబ్బర్డ్ ఆయన్ని కలిశారు.మోదీ అంటే ఆమెకు ఎంతో గౌరవం.భారత్‌తో ఆమెకు ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి.
అయితే చాలామంది తులసి పేరు చూసి ఆమె ఇండియన్ అనుకుంటారు.కానీ నిజం వేరు.
ఆమెది ఇండియన్ మూలాలు కాదు.కానీ ఆమె తల్లి హిందూ మతం పుచ్చుకోవడంతో, ఆమె పిల్లలందరికీ హిందూ పేర్లు పెట్టారు.

అసలు విషయానికి వస్తే, తులసి గబ్బర్డ్ DNIగా ఎన్నికైన వార్త వైరల్ అవుతుండగా, ఆమె మిలిటరీ ట్రైనింగ్‌కు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.ఆ వీడియోలో తులసి గబ్బర్డ్ తుపాకులు పేల్చడం, భారీ ఆయుధాలు వాడటం, కఠినమైన వ్యాయామాలు చేయడం చూడొచ్చు.యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉండటంతో, జాతీయ భద్రత విషయంలో ఆమెకు మంచి పట్టుందని చెప్పొచ్చు.
ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌గా తులసి గబ్బర్డ్ బాధ్యతలు చేపట్టడంతో, అమెరికా నిఘా వర్గాలన్నిటికీ ఆమెనే పెద్ద దిక్కు.
దేశ భద్రతను కాపాడటం, నిఘా వైఫల్యాలను నివారించడం ఆమె ముఖ్య లక్ష్యాలు.







