ఫస్ట్ టైం రెమ్యూనరేషన్ పై ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ.. ఎంతనో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.నువ్విలా అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి విజయ్ దేవరకొండ పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.

 Vijay Devarakonda First Time Responded On His Remuneration , Vijay Devarakonda,-TeluguStop.com

ఇక పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.అనంతరం అర్జున్ రెడ్డి గీత గోవిందం వంటి సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

Telugu Khushi-Movie

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి విజయ్ దేవర కొండకు పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయింది.ఇటీవల ఖుషి సినిమా ( Khushi Movie ) ద్వారా వచ్చి మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కానున్న తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అయితే ఈ ప్రమోషన్లలో భాగంగా మొదటి సారి విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ ( Remuneration ) గురించి ఓపెన్ అయ్యారు.

Telugu Khushi-Movie

ఈయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ రూమర్లన్నింటిని ఖండిస్తూ ఈయన అసలు విషయం వెల్లడించారు.నేను ఖుషి సినిమా నుంచి సరైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని తెలిపారు.అంతకుముందు ఇండస్ట్రీలో నన్ను నేను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేసాను కానీ రెమ్యూనరేషన్ గురించి ఏమాత్రం ఆలోచించలేదని ఇక ఈ సినిమా తర్వాత మార్కెట్లో తనకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన సరైన ఫిగర్ చెప్పకపోయినా మార్కెట్ ఆధారంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube