రౌడీ స్టార్‌ కి దెబ్బ మీద దెబ్బ.. ఈయన మళ్లీ కోలుకుంటాడా? లేదా?

2017 లో వచ్చిన అర్జున్‌ రెడ్డి… 2018 లో వచ్చిన గీతా గోవిందం సినిమా తర్వాత ఇప్పటి వరకు విజయ్‌ దేవరకొండ కమర్షియల్‌ గా భారీ విజయాలను సొంతం చేసుకోలేక పోయాడు.గత ఏడాది లైగర్ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఆయన అభిమానులు భావించారు.

 Vijay Devarakonda Facing Problems In His Career , Vijay Devarakonda , Career Pro-TeluguStop.com

కానీ లైగర్‌ సినిమా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.హీరోగా విజయ్ దేవరకొండ యొక్క స్టామినా మెల్ల మెల్లగా తగ్గుతుంది అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

అయిదు సంవత్సరాలుగా సక్సెస్ లేకుండానే కెరీర్‌ ను నెట్టుకు రావడం అంటే మామూలు విషయం కాదు.గీత గోవిందం రేంజ్ లో లేదా అర్జున్‌ రెడ్డి స్థాయిలో మరో విజయం సొంతం అయితే తప్ప విజయ్ దేవరకొండ కెరీర్‌ నిలదొక్కుకోవడం సాధ్యం అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉండటం వల్ల విజయ్ దేవరకొండ ఏ సినిమా చేసినా కూడా హడావుడి ఉంది.

Telugu Ananya Pandey, Arjun Reddy, Geeta Govindam, Kushi, Liger, Samantha-Movie

ప్రస్తుతం ఖుషి సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు.ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా లైగర్‌.అంతకు ముందు వరల్డ్‌ ఫేమస్ లవర్‌.

అంతకు ముందు డియర్ కామ్రెడ్‌ ఇలా అన్ని సినిమాలు కూడా బొక్క బోర్లా పడుతున్నాయి.దాంతో ఖుషి సినిమా పై చాలా నమ్మకం పెట్టుకుని రౌడీ స్టార్‌ మొదలు పెట్టాడు.

షూటింగ్‌ సగం పూర్తి అవ్వగానే సమంత అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా షూటింగ్‌ జరగడం లేదు.ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరిలో ఖుషి సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.

Telugu Ananya Pandey, Arjun Reddy, Geeta Govindam, Kushi, Liger, Samantha-Movie

కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి అవ్వక పోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే వరుస దెబ్బలు తింటున్న విజయ్‌ దేవరకొండకు ఇది కోలుకోలేని మరో దెబ్బ అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రౌడీ స్టార్‌ మళ్లీ కోలుకోవాలి అంటే కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సి ఉంది.అది ఎప్పటికి సాధ్యం అయ్యేనో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube