సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే యోచనలో రౌడీ స్టార్‌?

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరో గా మృణాల్‌ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ మూవీ( Family Star ) సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది అంటూ ప్రకటించారు.దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కు పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

 Vijay Devarakonda And Mrunal Thakur Movie Family Star Release Date Update Detail-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా షూటింగ్ ను డిసెంబర్‌ లో పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేశాం అంటూ ఆ మధ్య దిల్‌ రాజు కాంపౌండ్‌ నుంచి ప్రకటన వచ్చింది.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ డిసెంబర్‌ వరకు పూర్తి చేసే అవకాశం లేదు.

ఒక వేళ హడావుడిగా పూర్తి చేయాలి అనుకుంటే అయ్యే అవకాశాలు ఉన్నాయి.కానీ అలా హడావుడిగా సినిమా ను పూర్తి చేయాలని అనుకోవడం లేదు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.అందుకే సినిమా సంక్రాంతికి( Sankranti ) విడుదల అవ్వడం సాధ్యం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ను సంక్రాంతికి కాకుండా మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌ లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.

సమ్మర్‌ సీజన్‌ ఆరంభం లో వచ్చిన సినిమా లకు గతంలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది.అందుకే ఫ్యామిలీ స్టార్‌ సినిమా ను సమ్మర్‌( Summer ) ఆరంభం లో విడుదల చేసి అన్ని విధాలుగా బెనిఫిట్స్ ను పొందాలని దిల్‌ రాజు( Dil Raju ) కాంపౌండ్ భావిస్తున్నరట.సంక్రాంతికి దిల్‌ రాజు నుంచి మొదట గేమ్‌ చేంజర్‌( Game Changer ) వస్తుందని అన్నారు.

ఆ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవ్వడం తో ఫ్యామిలీ స్టార్‌ ను అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దిల్‌ రాజు ఆశ పడ్డాడు.కానీ దిల్‌ రాజు ఈ సంక్రాంతిని వదిలేయాల్సి వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube