సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే యోచనలో రౌడీ స్టార్‌?

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరో గా మృణాల్‌ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ మూవీ( Family Star ) సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది అంటూ ప్రకటించారు.

దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కు పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా షూటింగ్ ను డిసెంబర్‌ లో పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేశాం అంటూ ఆ మధ్య దిల్‌ రాజు కాంపౌండ్‌ నుంచి ప్రకటన వచ్చింది.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ డిసెంబర్‌ వరకు పూర్తి చేసే అవకాశం లేదు.

"""/" / ఒక వేళ హడావుడిగా పూర్తి చేయాలి అనుకుంటే అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కానీ అలా హడావుడిగా సినిమా ను పూర్తి చేయాలని అనుకోవడం లేదు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అందుకే సినిమా సంక్రాంతికి( Sankranti ) విడుదల అవ్వడం సాధ్యం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ను సంక్రాంతికి కాకుండా మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌ లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.

"""/" / సమ్మర్‌ సీజన్‌ ఆరంభం లో వచ్చిన సినిమా లకు గతంలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

అందుకే ఫ్యామిలీ స్టార్‌ సినిమా ను సమ్మర్‌( Summer ) ఆరంభం లో విడుదల చేసి అన్ని విధాలుగా బెనిఫిట్స్ ను పొందాలని దిల్‌ రాజు( Dil Raju ) కాంపౌండ్ భావిస్తున్నరట.

సంక్రాంతికి దిల్‌ రాజు నుంచి మొదట గేమ్‌ చేంజర్‌( Game Changer ) వస్తుందని అన్నారు.

ఆ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవ్వడం తో ఫ్యామిలీ స్టార్‌ ను అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దిల్‌ రాజు ఆశ పడ్డాడు.

కానీ దిల్‌ రాజు ఈ సంక్రాంతిని వదిలేయాల్సి వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.