టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ యాంకర్ అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ) ల మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన వీరి గొడవ ఇప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉంది.
అనసూయ కూడా పరోక్షంగా విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నడంతో అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటింస్తున్న ఖుషి( Khushi ) సినిమా పోస్టర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే.

అందులో విజయ్ దేవరకొండ పేరు ది విజయ్ దేవరకొండ అని ఉంది.ఇక ఆ విషయం పై అనసూయ స్పందిస్తూ.ఇప్పుడే ఒకటి చూశాను.ది నా.బాబోయ్ ఏం చేస్తాం.పైత్యం అంటకుండా చూసుకుందాం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
దాంతో విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ మధ్య మళ్లీ వార్ మొదలయ్యింది.ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ అలాగే యాంకర్ అనసూయ భర్తకు సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.
అదేంటంటే కొన్ని నెలల క్రితం ఒక సినిమా ఫంక్షన్‌లో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్( Sushank Bhardwaj ), విజయ్ దేవరకొండతో గొడవ పెట్టుకున్నారట.

వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.తన సినిమా గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారట.తన భర్తతో గొడవ పెట్టుకోవటంతో విజయ్ మీద అనసూయకు కోపం ఇంకా పెరిగిందని తెలుస్తోంది.
అందుకే వీలు చిక్కినప్పుడల్లా టార్గెట్ చేసి కామెంట్లు చేస్తోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.మరి ఈ వార్తపై అనసూయ, విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.