విజయ్‌ దేవరకొండ 'మజిలీ' చేరబోతున్నాడా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ.ఈయన గత కొంత కాలంగా వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు.

డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని విడుదల చేసిన విజయ్‌ ప్రస్తుతం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.ఆ చిత్రంకు క్రాంతి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ సినిమా పూర్తి అయిన వెంటనే పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఫైటర్‌ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు.ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

భారీ ఎత్తున అంచనాలున్న ఫైటర్‌ చిత్రాన్ని మరి కొద్ది రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యిందని పూరి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

Advertisement

విజయ్‌ దేవరకొండ బ్యానర్‌లో నిర్మాణం జరిగిన మీకు మాత్రమే చెప్తా సినిమాను నేడు ప్రేక్షకులముందుకు తీసుకు వస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా విజయ్‌ దేవరకొండ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.ప్రస్తుతం చేస్తున్న వరల్డ్‌ ఫేమస్‌ లవ్‌ స్టోరీతో పాటు పూరి సినిమాను కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నాను.హీరో సినిమా కూడా త్వరలో ప్రారంభం అవుతుంది.

అలాగే మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్వాన ఒక కథ చెప్పాడు.ఆ కథతో సినిమా చేయాల్సి ఉంది.

త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు.హీరో సినిమా కంటే ముందే శివ నిర్వాన దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest

మజిలీతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న శివకు విజయ్‌ ఛాన్స్‌ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు