తమిళ నటుడు అయిన విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమా ( Bicchagadu movie ) తో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.ఈ సినిమా కంటే ముందే విజయ్ ఆంటోని నటించిన కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్ అయినప్పటికీ బిచ్చగాడు సినిమా తోనే ఈయనకు చాలామంది అభిమానులు పెరిగారు.
అంతేకాదు ఈ సినిమాలోని ఎమోషన్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.అలాంటి విజయ్ ఆంటోనీ ( Vijay Antony ) ఈ మధ్యనే తన పెద్ద కూతుర్ని కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే.
కూతురు మరణించినా కూడా ఆ బాధను దిగమింగుకొని తన సినిమా యూనిట్ కి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో బిచ్చగాడు 2 సినిమాని పూర్తి చేసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు.ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన బిచ్చగాడు 2 సినిమా అనుకున్నంత ఫలితం అయితే రాబట్టలేక పోయింది కానీ ఓ మోస్తరు హిట్ అయింది.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా విజయ్ ఆంటోనీ తన భార్య ఫాతిమా ( Fathima ) కు విడాకులు ఇచ్చేసి బిగ్ బాస్ బ్యూటీని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ నెట్టింట్లో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వార్తలపై విజయ్ ఆంటోని కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇందులో నిజమే ఉంది అని చాలామంది భావించారు.
కానీ అదే సమయంలో తన కూతురు మరణించడంతో ఆ వార్తలకు పులిస్టాప్ పడింది.అయితే తాజాగా విజయ్ ఆంటోనీ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది.
తమిళ బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అనూయ ( Anooya ) చాలామందికి తెలియకపోవచ్చు.అయితే ఈమె ప్రస్తుతం కొన్ని ఐటెం సాంగ్స్ లో అలాగే తన గ్లామర్స్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.అయితే అలాంటి అనూయ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో ముచ్చటిస్తూ తన గురించి వచ్చిన చెత్త రూమర్స్ పై స్పందించింది.నాకు నటుడు జీవా( Jeeva ), సుందర్ సి,విజయ్ ఆంటోనీ వంటి వారితో రిలేషన్ ఉందని చాలామంది ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.అలాగే ఇలాంటి అసత్యాలు నమ్మకండి.నేను ఇప్పటికి కూడా సింగిల్ గానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.అయితే ఒక నెటిజన్ మీరు పెళ్లి చేసుకోరా అని అడిగితే నా చుట్టూ పెళ్లి చేసుకునేంత మంచి మగవాళ్ళు ఎవరూ లేరు అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
ఇక నటి అనూయ స్పందించడంతో విజయ్ ఆంటోనీ (Vijay Antony) తో రిలేషన్ వార్తలపై క్లారిటీ వచ్చినట్లయింది.