Nayanathara :నయనతార కి ఖరీదైన కారు కొనిచ్చిన విగ్నేష్ శివన్.. ధర ఎంత తెలుసా..?

లేడీ సూపర్ స్టార్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న నయనతార ( Nayanathara )ఈ మధ్యనే తన 39 వ బర్త్డేని చాలా గ్రాండ్ గా జరుపుకుంది.నవంబర్ 18న ఈమె బర్త్డేని దేశవ్యాప్తంగా ఆమె అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా జరుపుకున్నారు.

 Vignesh Sivan Bought An Expensive Car For Nayanathara Do You Know The Price-TeluguStop.com

ఇక ఈమె తన భర్త పిల్లలతో కూడా తన బర్త్డే వేడుకలను జరుపుకుంది.ఇక ఈమె బర్త్ డే కి తన భర్త విఘ్నేష్ శివన్ ( Vignesh shivan ) ఒక కాస్ట్లీ గిఫ్ట్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది.

నయనతార విఘ్నేష్ శివన్ లు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరూ చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుపుకున్నారు.

అయితే ఎన్నో సంవత్సరాలు రిలేషన్ లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి పెళ్లి సమయంలోవ్వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా విఘ్నేష్ శివన్ తన భార్య నయనతార కి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.తన భార్య నయనతార కి ప్రేమతో మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ కారును కొనిచ్చినట్టు తెలుస్తుంది.

ఇక ఈ కారు విలువ దాదాపు మూడు కోట్ల నలభై లక్షల వరకు ఉంటుందని సమాచారం.అయితే తన భర్త తనకి ప్రేమతో ఈ కారును కొనిచ్చారని నయనతార స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ లు నెట్టింట్లో వైరల్ గా మారింది.తాజాగా నయనతార నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నపూర్ణి ( Annapurni ) ఈరోజు అనగా డిసెంబర్ 1న గ్రాండ్ గా విడుదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube