క్యాన్సర్ తో వియత్నాం టార్జాన్ మృతి

వియత్నాంలో టార్జన్ అంటూ కొంత కాలం క్రితం ప్రపంచవ్యాప్తంగా మీడియాలో విశేషంగా కథలు వచ్చాయి.40 ఏళ్ల పాటు అడవిలోనే బతికినా హూ వాన్ లాంగ్ అనే వ్యక్తి నాగరిక సమాజంలోకి అడుగుపెట్టడంతో అందరి దృష్టి అతనిపై పడింది.  కానీ విషాదం ఏంటంటే ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాన్ లాంగ్ కేవలం కొన్నేళ్లపాటే బతికాడు.52 ఏళ్ల వయసులో లివర్ క్యాన్సర్ తో తుది శ్వాస విడిచాడు.వియత్నాం యుద్ధ సమయంలో లాంగ్ చాలా చిన్నవాడు.అతడికి రెండు ఏళ్ళ వయసు ఉంటుంది.అయిన వాళ్ళందరూ యుద్ధములో చనిపోగా లాంగ్, తండ్రి, సోదరుడు మిగిలారు.లాంగ్ ను తీసుకొని తండ్రి అడవుల్లోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు.

 Vietnam Tarzaan Hoo Wan Lang Died Of Cancer, Vietnam Tarzaan, Died Of Cancer, Ho-TeluguStop.com

చెట్లు పైనా, గృహాల్లో నివసిస్తూ అక్కడ దొరికే వాటిని తింటూ నాలుగు దశాబ్దాలుగా గడిపారు.లాంగ్ కు ఊహ తెలియకముందే అడవుల్లోకి  వెళ్లిపోవడంతో కనీసం స్త్రీ సాంగత్యం గురించి కూడా తెలియకుండా పెరిగాడు.2013లో అధికారులు ఎంతో శ్రమించి వీరు జాడను కొనుక్కొని ప్రజల్లోకి తీసుకు వచ్చారు.2017లో లాంగ్ తండ్రి థాన్ మరణించగా.లాంగ్ తన అడవి నివాసానికి మళ్లీ వెళ్లిపోయాడు.

Telugu Cancer, Drunk Wine, Hoo Wan Long, Lever Cancer, Lived, Socia, Tarzan, Vie

తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత ఇటీవలే లాంగ్ ఆరోగ్యం బాగా క్షీణించింది.వైద్యపరీక్షల్లో అతడు లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వెల్లడైంది.గ్రామస్తులు అందర్నీ విషాదంలో ముంచెత్తతూ.

గత సోమవారం కన్నుమూశాడు.అడవుల్లో సహజసిద్ధ ఆహారం తిని ఆరోగ్యంగా ఉన్న లాంగ్ బయటి ప్రపంచంలో శుద్ధి చేసిన ఆహారాన్ని తినడం, మద్యం తాగడం వంటి కారణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని లాంగ్ స్నేహితుడు సెరెజో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube