డర్టీ పిక్చర్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి విద్య బాలన్(Vidya Balan).ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.2005వ సంవత్సరంలో తన సినీ కెరియర్ ప్రారంభించినటువంటి విద్యాబాలన్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె 2014వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ (Padma Sree) అవార్డును కూడా అందుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఈమె 2012 వ సంవత్సరంలో నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్(Siddharth Rai Kapoor) నుఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ఈమె తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఒక అమ్మాయితో కలిసి చాలా చనువుగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఆ అమ్మాయి చేయి పట్టుకుని ఎయిర్ పోర్ట్ లో తనతో పాటు నడిచి వచ్చారు అలాగే తనతో పాటు ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.
ఈ విధంగా విద్యాబాలన్ ఆ అమ్మాయితో చాలా చనువుగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఆమె తన కూతురేనని భావించారు.అయితే విద్యాబాలన్ కి ఇంత పెద్ద కూతురు( Vidyabalan Daughter ) ఉందా అసలు ఈమెకు ఇంత పెద్ద కూతురు ఉందనే విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారనే విషయాల గురించి వార్తలు వైరల్ కావడంతో ఈ వార్తల స్పందించారు.మీరందరూ అనుకున్నట్టు ఆమె నా కూతురు కాదని, నాకు కూతురు వరస అయ్యే అమ్మాయిని తన పేరు ఐరా (Ira) అంటూ తెలియచేశారు.తన సోదరికి కవల అమ్మాయిలు కావడంతో వారిలో ఒకరే ఈ ఐరా అని విద్యాబాలన్ తెలిపారు.
ఇక ఆ అమ్మాయి నా కూతురే అంటూ ఈ విషయాన్ని ఇంత పెద్దది చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.