వీడియో: షాపు ఓనర్‌ని చెప్పుతో కొట్టిన యువతి.. కారణం తెలిస్తే..

ఈ రోజుల్లో కామాంధులు పట్టపగలే ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షాక్‌లు ఇస్తున్నారు.ఒక్కోసారి ఆడవారు ఎదురు తిరిగి వీరికి దేహాశుద్ధి చేస్తున్నారు.

 Video: Young Woman Slaps Shop Owner.. If You Know The Reason, Viral News, Latest-TeluguStop.com

ఇటీవల కేరళలోని త్రిస్సూర్‌ సిటీలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.ఒక వృద్ధుడు రిటైల్ షాప్ నడుపుతున్నాడు.

ఆ షాప్‌కి వచ్చిన ఓ యువతి( Young woman )ని ఈ వృద్ధుడు అసభ్యంగా పట్టుకున్నాడు.దాంతో కోపోద్రిక్తురాలైన సదరు యువతి అతడిని బహిరంగంగా చెప్పుతో కొట్టింది.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన త్రిసూర్‌లోని మార్కెట్ ప్రాంతంలో, మెడికల్ కాలేజీకి సమీపంలో చోటు చేసుకుంది.ఈ ఘటనను కొందరు తమ ఫోన్ కెమెరాల్లో రికార్డు చేశారు.వాటిలో ఒక వీడియో ట్విట్టర్‌లో ప్రత్యక్షమై వైరల్ అవుతుంది.

ఈ ఘటనకు దారి తీసిన కారణాల గురించి కూడా వీడియో షేర్ చేసిన వారు వెల్లడించారు.ఆ వివరాల ప్రకారం అలీ( Ali ) అనే వృద్ధుడు కిరాణా దుకాణం నడుపుతున్నాడు.

బాధిత యువతి సరుకులు కొనుగోలు చేసేందుకు అతడి షాప్ కి వెళ్ళింది.ఆ సమయంలో ఈ వృద్ధుడు యువతి బ్రెస్ట్స్‌ పట్టుకున్నాడట.

దీంతో కోపంతో ఊగిపోతూ తనతో అనుచితంగా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం అంటూ తిట్టేసింది.

అలా తిడుతూనే అలీని చెప్పులతో చెంప పగల కొట్టింది.అయితే వృద్ధుడు ప్రతిఘటించకుండా క్షమాపణలు చెప్పాడు.అంతేకాకుండా తనపై పోలీస్ కేసు ( Police )పెట్టొద్దని వారిని వేడుకున్నాడు.

అక్కడే ఉన్న మరొక మహిళ, వృద్ధుడు ఇంతకుముందు కూడా ఆడవారితో ఇలానే అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.ఇంకా రెండు దెబ్బలు వేయాలంటూ బాధిత యువతిని ఎంకరేజ్ చేసింది.

అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube