వీడియో: వావ్, కన్నడలో అనర్గళంగా మాట్లాడుతోన్న జర్మన్ మహిళ..

మన భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడుతుంటారు మన ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నాయి అయితే ఒక ప్రాంతంలో నివసించేవారు మరొక భాష మాట్లాడలేరు.

ఎందుకంటే అది వాళ్ళ మాతృభాష కాదు.

హిందీ చాలా చోట్ల మాట్లాడుతారు కాబట్టి అది కొంతమంది నేర్చుకుంటారు.మిగతా ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం దాదాపు శూన్యం అని చెప్పుకోవచ్చు.

అయితే ఒక జర్మన్ మహిళ( German woman ) మాత్రం అద్భుతంగా కన్నడ లాంగ్వేజ్ మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో అచ్చం భారతీయురాలి వలె శారీ కట్టుకొని కన్నడలో మాట్లాడుతుంది.ఇప్పుడు బెంగళూరు నగరం కన్నడ వారిదే అనే వివాదం నడుస్తున్న సమయంలో ఈ వీడియో చాలా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

వీడియోలో, జెనిఫర్( Jennifer ) అనే జర్మన్ దేశస్తురాలు కర్ణాటకలో( Karnataka ) ఉంటున్నారు.ఆమె కన్నడ నేర్చుకుని, స్థానికులతో కన్నడలో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది.

కన్నడలో మాట్లాడటం కోసం ప్రయత్నించి ఆమె చాలా మెప్పు పొందింది."జర్మన్ వారు కన్నడ నేర్చుకోగలిగారు.

మరి భారతీయులు కన్నడ వారితో కన్నడలో మాట్లాడటం ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? అని ఈ వీడియోకి ఒక క్యాప్షన్ జోడించారు.బెంగళూరుకి వచ్చే వాళ్ళందరికీ ఒక హెచ్చరిక కూడా చేశారు.

కన్నడ మాట్లాడకపోతే లేదా కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నించకపోతే వాళ్లను బయటి వాళ్లుగానే చూస్తామని చెప్పారు.

ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 28, గురువారం, 2021

సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అయింది.ఈ వీడియో చూసిన వాళ్ళు దాని గురించి తమ అభిప్రాయాలను కామెంట్స్ లో పెడుతున్నారు.ఒకరు "నేను కొన్నేళ్లు కర్ణాటకలో ఉండేవాణ్ని.

Advertisement

నా స్నేహితులతో, ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చిన వాళ్లతో మాట్లాడాలంటే కన్నడ నేర్చుకోవాలి అని అనుకున్నాను.వారి భాష, వారి సంస్కృతిని గౌరవించడానికి ఇది చాలా ముఖ్యం.

ఇది చాలా సహజమైన విషయం.నేను ఇప్పటికీ కన్నడ మాట్లాడగలను" అన్నారు.

ఇంకొకరు "ఒకసారి నాకు కన్నడ బాగా రాకపోయినా, ఒక ఇడ్లీ దుకాణంలో కన్నడలో మాట్లాడడానికి ప్రయత్నించాను.అప్పుడు అక్కడ ఉన్న ఒకరు నా ఉచ్చారణ గురించి అవమానించారు.

కానీ మిగతా వాళ్ళంతా నన్ను ఆదుకున్నారు.నేను కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పి నన్ను ప్రోత్సహించారు.

అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది" అన్నారు.

మరొకరు "ఆమె స్వచ్ఛందంగా కన్నడ మాట్లాడుతుంది.ఎవరూ ఆమెను బలవంతం చేయలేదు.ఇది చాలా ముఖ్యమైన విషయం" అన్నారు.

"ఈ లాజిక్ ప్రకారం, మహారాష్ట్రలో ఉండే కన్నడ వాళ్ళందరూ మరాఠీ మాట్లాడాలి అన్నమాట.మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద మరాఠీ భాషను రుద్దడం సరైనదే అని అర్థమవుతుంది.

ఒకరు తమ తల్లిదండ్రుల భాషను నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది.ఒకరి భాష మాట్లాడలేకపోతున్నామంటే అది వారిని అవమానించినట్లు కాదు.

" అని కొందరి నెటిజన్లు కామెంట్లు చేశారు.ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు