వీడియో: చాక్లెట్లు కొట్టేసిన తల్లి.. పీఎస్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన మూడేళ్ల బాబు..

చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు మనల్ని ఎంతగానో అలరిస్తాయి.అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించింది.

 Video: Three-year-old Boy Who Went To Ps And Gave A Complaint After The Mother H-TeluguStop.com

ఈ వీడియోలో ఒక చిన్న పిల్లోడు ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన తల్లిపై కంప్లైంట్ ఇచ్చాడు.ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వీడియో ప్రకారం, చాక్లెట్లు, క్యాండీలు తినకుండా అడ్డుకున్న తన తల్లిపై కోపంతో మూడేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు.అక్కడ తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వీడియోలో కనిపిస్తుంది.

వైరల్ వీడియోలో తన తల్లి తనను చాక్లెట్లు తినడానికి అనుమతించడం లేదని ఆ చిన్నారి ఓ మహిళా పోలీసుకు ఫిర్యాదు చేయడం కనిపించింది.మమ్మీ నా చాక్లెట్లు దొంగిలించింది.

ఆమెను జైలులో పెట్టండి అని ఆ చిన్నారి మహిళా కానిస్టేబుల్‌తో చెప్పాడు.ఈ క్యూట్ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని దేధతలై గ్రామంలోని పోలీస్ స్టేషన్‌లో వెలుగు చూసింది.

మూడేళ్ల పిల్లాడు ఎలా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడనే కదా మీ సందేహం.నిజానికి ఈ బాలుడిని అతని తండ్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు.

అతను తన తల్లిపై ఫిర్యాదు చేస్తున్నప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ అతని ఫిర్యాదును చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు నటించింది.ఆ పిల్లోడు కంప్లైంట్ రాస్తూ ఉండగా ఆ అమాయకత్వాన్ని చూసి మహిళా పోలీసు చిరునవ్వు నవ్వేసింది.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.స్నానం చేసిన తర్వాత ఈ పిల్లోడిని రెడీ చేయించాలని తల్లి అనుకుంది కానీ అప్పుడే అతడు తనకు చాక్లెట్ తినాలనుందని మారం చేశాడు.

దాంతో చెప్పిన మాట విను అని తల్లి చిన్నగా ఒక దెబ్బ వేసింది.అప్పుడు అతను ఏడుపు ప్రారంభించాడు.ఆపై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని తండ్రిని అడిగాడు.పిల్లల ఫిర్యాదును విని పోలీసులందరూ నవ్వుకున్నారని సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రియాంక నాయక్ చెప్పారు.

తర్వాత, తల్లికి ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని నేను అతనికి వివరించాను, ఆపై అతను ఇంటికి బయలుదేరాడు, అని ప్రియాంక నాయక్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube