సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి.వాటిలో ట్విస్టులు కూడా ఉంటాయి.
ఆ ట్విస్టులు అన్‌ఫోల్డ్ అయినప్పుడు నవ్వొస్తుంది లేదా భయం కలుగుతుంది.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.
వైరల్ వీడియో ఓపెన్ చేస్తే కొందరు యువతలు బిగ్గరగా అరుస్తూ వేగంగా పరిగెత్తడం చూడవచ్చు.ఇదొక షాప్ అని తెలుస్తోంది.
ఈ షాప్ కౌంటర్ దగ్గర ఉన్న ఒక యువతి వారు పరిగెత్తడం చూసి చాలా భయపడి పోయింది.దొంగలు( Thieves ) చేత గన్నులు పట్టుకొని చోరీ చేయడానికి వస్తున్నారేమో అని కౌంటర్ వద్ద ఉన్న ఉద్యోగి భయపడిపోయింది.
అనంతరం అక్కడినుంచి వెళ్ళిపోయేందుకు డెస్క్ ఎక్కి దూకేసింది.అయితే అప్పుడే ఒక ఊహించని దృశ్యం కనిపించింది.
అదేంటంటే ఆ షాప్‌లోకి ఒక చిన్న కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది.దాన్ని చూసి మిగతా యువతులు పరిగెత్తారు.
అయితే ఆ కుక్క వల్ల భయపడటం చూసి కౌంటర్ దగ్గర ఉన్న యువతి ఊపిరి పీల్చుకుంది.కుక్కకే ఇంత సీన్ చేశారా అని నవ్వుకుంది.

అనంతరం కుక్కని బయటికి తీసుకువెళ్లేందుకు ఒక సెక్యూరిటీ గార్డ్ ( security guard )వెనకే పరిగెత్తుకుంటూ రావడం చూడవచ్చు.అది పిట్ బుల్ డాగ్ హా లేదా వేరే డాగ్ హా అనేది స్పష్టంగా తెలియ రాలేదు కానీ అది మాత్రం పెద్ద బీభత్సమే సృష్టించింది.ఈ వీడియోని ప్రముఖ వైరల్ వీడియో షేరింగ్ పేజీ సీసీటీవీ వీడియోస్ షేర్ చేసింది.ఈ వీడియో చూసి దానికే అంత భయపడి పోవాలా అని నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు.
దీనికి రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.







