వీడియో: నీ తెలివి తేటలు సూపర్ భయ్యా... ఊపకుండానే ఉయ్యాల ఊగుతున్నావ్‌గా!

మన ఇండియన్స్ చాలా తెలివైన వారు.మనోళ్లు ఎలాంటి సమస్యలనైనా తమకు అనుగుణంగా మార్చుకోగల స్మార్ట్ పీపుల్ అని చెప్పవచ్చు.

 Video Of A Man Enjoying Swinging Inside Moving Truck Viral Details, Swing, Lorry-TeluguStop.com

అలాగే చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ వారు ఆశ్చర్యపరుస్తుంటారు.స్మార్ట్ వర్క్ చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు.

వారు చేసే ఈ పనులన్నీటికీ దేశీ జుగాడ్‌( Desi Jugad ) అని పేరు పెట్టారు.ఈ దేశీ జుగాడ్‌కి సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇటీవల కదులుతున్న ట్రక్కు కింద మంచం వేసి హాయిగా నిద్రపోతున్న వ్యక్తి వైరల్ అయిన విషయం తెలిసిందే.అది మరవక ముందే ఇప్పుడు అలాంటి మరో తెలివైన వ్యక్తి వైరల్ గా మారాడు.

ఈ వ్యక్తి కదులుతున్న ట్రక్కులో ఆటోమేటిక్‌గా ఉయ్యాల ఊగుతూ( Swing ) కనిపించాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సాధారణంగా లారీలు, ట్రక్కులు వెళ్తున్నప్పుడు అవి ఊగుతూ ఉంటాయి.వాటిలో ప్రయాణించే వ్యక్తులు ముందుకు వెనకకు ఊగుతూ ఉంటారు.అయితే ఇలా ఊపే సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ వ్యక్తి అనుకున్నాడు.ఇంకేముంది అతడు బుర్రకి ఒక తెలివైన ఆలోచన వచ్చింది.దాంతో వెంటనే ట్రక్కులో( Truck ) ఒక ఊయల ఏర్పాటు చేశాడు.అనంతరం ట్రక్కు కదులుతున్న సమయంలో ఆ ఉయ్యాలలో కూర్చున్నాడు.

రోడ్డుపై ట్రక్కు అతివేగంతో దూసుకుపోతుండడం, దానిలోపల ఓ వ్యక్తి ఎవరూ ఊపకుండానే ఊగుతుండడం వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో badboy_6278m అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన ఊయలను ట్రక్కు పైభాగంలో ఉన్న మందపాటి ఇనుప పైపుకు కట్టి, చిన్న పిల్లాడిలా సరదాగా ట్రక్కు లోపల ఊపడం ఎలా ప్రారంభించాడో మీరు చూడవచ్చు.ఈ జుగాడ్‌ని చూసిన జనాలు తెలుగు సూపర్ భయ్యా అని కామెంట్ చేస్తున్నారు.

మరి కొందరు బాగా నవ్వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube