మన దేశంలో రజిని కాంత్( Rajini Kanth ) అంటే ఇష్టపడని వారు ఉండరు.ఆయన స్టైల్ కి, ఆయన గ్రేస్ కి ఎవ్వరైనా సరే ఫాన్స్ అవ్వాల్సిందే.
రజిని కాంత్ ప్రస్తుతం “జైలర్” ( Jailer )చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్నారు.కొన్నాళ్లుగా తన రేంజ్ కి తగ్గ హిట్ లేక సతమవుతున్న తలైవా, ఈ చిత్రంతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారనే చెప్పాలి.
ఈ చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.కేవలం తెలుగులోనే ఈ చిత్రం 70 కోట్లు కొల్లగొట్టింది సమాచారం.
డార్క్ హ్యూమర్ యాంగిల్ లో ఒక ఆక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అనిరుద్ మ్యూజిక్, బాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి.

రజిని కాంత్ పేరుకి కోలీవుడ్ హీరో ఐనప్పటికీ.కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని పరిశ్రమలలో అభిమానులను సంపాదించుకున్నారు.అన్ని భాషలలో కొన్ని స్ట్రైట్ ఫిలిమ్స్ చేసారు రజిని కాంత్.తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఐతే యాక్షన్ స్టార్ అని పేరు తెచ్చుకున్న రజిని కాంత్ తెలుగులో చేసిన మొదటి చిత్రం ఒక ఫిమేల్ సెంట్రిక్ ఫిలిం.అదే కే.
బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన “అంతులేని కథ”( anthuleni katha ).ఈ చిత్రంలో హీరోయిన్ జయప్రధ.ఇందులో ఒక బాధ్యత లేని తాగుబోతు అన్నయ్యగా నటించారు రజినీకాంత్.ఈ చిత్రం 1976 లో విడుదలయింది.ఈ సినిమాలో రజినికాంత్ పై చిత్రీకరించిన “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి”అనే పాట ఇప్పటికి చాలా ఫేమస్.ఈ పాటను ఏసుదాస్ గారు పాడారు.

ఈ చిత్రం తరువాత తెలుగులో రజినీకాంత్ హీరోగా చేసిన పూర్తి స్ట్రైట్ ఫిలిం “చిలకమ్మా చెప్పింది”.ఈ చిత్రం 1977 లో విడుదలయింది.ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఈరంకి శర్మ గారు.ఏం.ఎస్.స్వామినాథన్ సంగీతం అందించారు.సంగీత, శ్రీప్రియ ముఖ్య పాత్రాలలో నటించారు.1977 సంవత్సరంలో ఈ చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో నంది పురస్కారాన్ని సొంత చేసుకుంది.