తెలంగాణలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో ఇక జూలు విదించాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినట్లే ఉంది .దానికి తగ్గట్టే ఎఐసిసి శరవేగం గా కార్యక్రమాలను రూపొందిస్తుంది.
ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలలో దాదాపు మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ గతంలో గెలిచిన రాష్ట్రాలే కావడం పైగా తెలంగాణలో కూడా గెలుపు ఆసలు సజీవంగా ఉండడంతో ఇప్పుడు మిగతా పార్టీల కన్నా బలంగా ప్రచారం చేయవలసిన అవసరం కాంగ్రెస్కే ఎక్కువ ఉండటంతో ఆ పార్టీ నాయకులు కూడా దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది .ఇప్పటికే సిడబ్ల్యూసి మీటింగ్ లో ప్రచార సరళి ఎన్నికల కమిటీ ల ఏర్పాట్లపై చర్చలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్కు యాక్షన్ ప్లాన్ షురూ చేసినట్లుగా తెలుస్తుంది.తెలంగాణలో భారీ బహిరంగ సభలకు ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది ఈనెల రెండో వారంలో ఉత్తర తెలంగాణ వేదికగా కరీంనగర్ మెదక్ వంటచోట్ల భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ అగ్ర నేతలను దింపాలని టీ కాంగ్రెస్( Telangana Congress ) వ్యూహ రచన చేస్తుంది.

ప్రియాంక గాంధీ( Priyanka Gandhi )తో మహిళా డిక్లరేషన్ ప్రకటింపచేసి అగ్రనేతలతో ఓటర్లనాకట్టుకునే హామీలను ప్రకటింపచేయాలన్నట్లుగా టీ కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా గెలుపు గుర్రాలను ఓడిసి పట్టుకోవడంలో విజయవంతమైన కాంగ్రెస్ మరోపక్క కమ్యూనిస్టులతో కూడా పొత్తును విజయవంతంగా కుదుర్చుకుంది .దాంతో ఇక అధికార పార్టీ వైఫల్యాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి దానిని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగేలా ప్రచారం చేయాలని అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను భారీ ఎత్తున ప్రచారం చేయడానికి కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది నిన్న మొన్నటి వరకు ముక్కోణపు పోటీ ఉంటుందన్న అంచనాలు ఏర్పడినా తన వ్యూహాత్మక తప్పిదాలతో భాజపా వెనకబడిపోవడంతో ఇప్పుడు పోటీ కాంగ్రెస్ బారాస మధ్యన మిగిలిపోవటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవాలన్న పట్టుదలలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న సూక్తిని బలంగా నమ్ముతున్న హస్తం పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా రుణం తీర్చుకోవాలన్న పిలుపును తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాంగ్రెస్( Telangana Congress ) కు అనుకూలంగా మారుతున్నాయని మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళితే తెలంగాణను గెలుచుకోవడం అంతా కష్టం కాదన్న భావనను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం కాంగ్రెస్ పట్ల అధికార పార్టీ చూపిస్తున్న ఉలికి పాటు కూడా పరిస్థితి కాంగ్రెస్ అనుకూలంగా ఉందన్న విషయాన్ని రుజువు చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .







