వీడియో: పిల్లల్ని రక్షించడానికి సింహంతో తలపడిన చిరుత.. చివరికి..?

మనుషుల్లోనే కాదు జంతు ప్రపంచంలో కూడా తల్లులు తమ పిల్లలను కాపాడడానికి ప్రాణాలను పణంగా పెడతాయి.

ఇటీవల టాంజానియాలోని గ్రుమేటి సెరెంగేటి రివర్ లాడ్జ్‌కి వెళ్లిన కారల్, బాబ్ దంపతులు తమ సఫారీ సమయంలో ఓం తల్లి చిరుత పులికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించారు.

వారి ముందే ఒక చిరుతపులి తన పిల్లలను రక్షించుకోవడానికి ఒక సింహంతో పోరాడింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కారల్, బాబ్ ఈ చిరుతపులి చేసిన త్యాగాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు.అడవి జంతువుల్లో ఇంత ధైర్యం, నిస్వార్థం చూడడం ఇదే మొదటిసారి అని వారు చెప్పారు.

తమ గైడ్‌తో కలిసి ఉదయాన్నే అడవిలోకి వెళ్లిన ఈ దంపతులు, ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఒక చిరుతపులిని చూడాలని ఆశపడ్డారు.కొంత సేపటికి, చిరుత తన రెండు పిల్లలతో కలిసి ఉన్న దృశ్యం వారికి కనిపించింది.

Advertisement

కానీ కొద్దిసేపటికి చిరుత తన గుహ నుంచి బయటకు వచ్చి, ఆందోళనగా కనిపించింది.మొదట వారు ఒక సింహం జీబ్రా గుంపును గమనిస్తుందని అనుకున్నారు.

కానీ సింహం క్రమంగా చిరుత గుహ దగ్గరకు వస్తున్నప్పుడు, వారు సింహం(Lion ) చిరుతపులి గుహపైనే దృష్టి సారించిందని గ్రహించారు.

కారల్ మాట్లాడుతూ "చిరుతపులి( Leopard ) తన గుహ నుంచి బయటకు వచ్చినప్పుడు, కొన్ని మీటర్ల దూరంలో సింహం గమనిస్తున్నట్లు చూశాం.మొదట మేం చిరుతపులి, దాని పిల్లలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో లేవని అనుకున్నాం.సింహం జీబ్రాలను మాత్రమే చూస్తోందని అనుకున్నాము.

కానీ తరువాత సింహం చిరుతపులులపైనే దృష్టి సారించిందని మేము అర్థం చేసుకున్నాము." అని చెప్పింది.

బిర్యానీ లవర్స్.. కొత్త పార్లే-జి బిస్కెట్ల బిర్యానీ వచ్చేసింది.. ట్రై చేసారా?
ఆస్ట్రేలియా బౌలర్లకు తాట తీసిన జైస్వాల్.. దిగ్గజాల సరసన చోటు

తన పిల్లలు ప్రమాదంలో పడ్డాయని తెలుసుకున్న చిరుత వెంటనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది.సింహం కంటే చాలా చిన్నదైనా, ధైర్యంగా దానితో పోరాడడానికి ముందుకు వచ్చింది.సింహం దాడి చేసింది.

Advertisement

రెండు జంతువులు ఉగ్రంగా పోరాడాయి.సింహం పరిమాణంలో తన కంటే చాలా పెద్దది అయినప్పటికీ, చిరుత తన పిల్లలను కాపాడటానికి చాలా కష్టపడింది.

చిరుతపులి సింహం కాలిని కొరికింది.దాంతో సింహం వెనక్కి తగ్గింది.

సింహం దృష్టి మరల్చిన సమయంలో, చిరుతపులి తన పిల్లలను సమీపంలోని చెట్టుకు తీసుకెళ్లి సురక్షితంగా ఉంచింది.అంతలోనే సింహాల గుంపు అక్కడికి చేరుకుంది.

బాబ్, కారల్ మాట్లాడుతూ "ఏమాత్రం ఆలోచించకుండా సింహం చిరుతపులితో పోరాడడానికి దూకింది! మిగతా సింహాలు దగ్గరలోనే ఉన్నప్పటికీ, ఆ సింహం చాలా ధైర్యంగా ఉంది కాబట్టి వాటి కోసం ఎదురు చూడలేదు.అది తనకు తాను చేసుకున్న పొరపాటు అని తర్వాత తెలుసుకుంది.

" అని చెప్పారు. సింహాలు చిరుతపులిని చేరుకోవడానికి ప్రయత్నించాయి కానీ అంతలోనే ఒక సింహం జీబ్రాను చూసి దాని వైపు పరిగెత్తింది.ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చిరుతపులి తన పిల్లలతో కలిసి సురక్షితంగా బయటపడింది.https://youtu.be/WH3mYLRmYgA?si=i_9BdCZ8F7HR2475 ఈ లింక్‌పై క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.

https://youtu.be/50AGBwngNyM

తాజా వార్తలు