భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ దీపావళి .( Diwali ) ఈ సందర్భంగా లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌కు( London Mayor Sadiq Khan ) చేదు అనుభవం ఎదురైంది.
లండన్‌లో స్థిరపడిన భారత సంతతి కంటెంట్ క్రియేటర్లు అక్షయ్, దీపాలి ఓ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.సదరు వీడియోలో మేయర్ సాదిక్ ఖాన్ .ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.తాము లండన్‌లో దీపావళిని ఇలా జరుపుకుంటామని ఖాన్ వివరించే ప్రయత్నం చేశారు.
ఆయన వెనుక నృత్యాలు, భారతీయ సాంప్రదాయ పద్ధతులు కనిపిస్తాయి.
27 అక్టోబర్ 2024న ట్రఫాల్గర్ స్క్వేర్‌లో జరిగే అతిపెద్ద దీపావళి వేడుకల్లో మీరు పాల్గొంటున్నారా అనే శీర్షికతో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.దీపావళి ఇన్ లండన్ కమిటీ , లండన్ మేయర్ సంయుక్తంగా ట్రఫాల్గర్ స్వ్కేర్‌లో( Trafalgar Square ) వేడుకలు జరుగుతాయని వీడియోలో నిర్వాహకులు తెలిపారు.భారత్‌లోని బహుళ సాంస్కృతిక కమ్యూనిటీల నుంచి ఈ కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన కనిపించినప్పటికీ .లండన్‌లో స్థిరపడిన ఓ వర్గం మాత్రం మేయర్ సాదిక్ ఖాన్‌పై మండిపడింది.మీరు క్రైస్తవుల పండుగ క్రిస్మస్ కోసం కృషి చేస్తారా అని ఓ యూజర్ ఆయనను ప్రశ్నించాడు.వేల ఏళ్లుగా క్రైస్తవ మతం బ్రిటీష్ సంస్కృతిలో అంతర్భాగంగా ఉందని.
క్రైస్తవులకు మరో పండగ లేదని మరో యూజర్ పేర్కొన్నాడు.సాదిక్ ఖాన్ తీరుపై మండిపడ్డ ఓ నెటిజన్ ‘‘ గో బ్యాక్ టూ ఇండియా ’’( Go Back To India ) అంటూ కామెంట్ చేశాడు.
ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఈ వ్యవహారంపై సాదిక్ ఖాన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.కాగా.భారతదేశంలో దీపావళి అక్టోబర్ 31న జరుపుకుంటుండగా.
మరికొన్ని చోట్ల నవంబర్ 1న కూడా జరుపుకోనున్నారు.ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లోనూ దివ్వెల పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.