వీడియో: దిల్బర్‌ పాటకు ఈ బుడతడు చేసిన డ్యాన్స్ చూసి ఐపీఎస్ అధికారిణి ఫిదా..!

సత్యమేవ జయతే సినిమాలో నేపథ్య గాయని నేహా కక్కర్ పాడిన దిల్బర్‌ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇప్పటికే ఈ వీడియోకి యూట్యూబ్ లో 25 కోట్ల వ్యూస్ వచ్చాయి.

అయితే తాజాగా ఈ పాటకు ఒక బుడతడు అద్భుతంగా డాన్స్ చేశాడు.హీరోయిన్ నోరా ఫతేహికి ఏ మాత్రం తీసిపోకుండా అతడు డ్యాన్స్ చించేశాడు.

దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ నేపథ్యంలో డా.

నవజ్యోత్ సిమి అనే ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఫిదా అయిపోయారు."ఆహా ఏమి ఆ డ్యాన్స్? సూపర్.ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి అద్భుతమైన టాలెంట్ చూడండి" అంటూ ఐపీఎస్ అధికారిణి నెట్టింట ఒక వీడియో షేర్ చేశారు.

Advertisement

ఇప్పుడా వీడియో అందర్నీ ఫిదా చేస్తోంది.వైరల్ వీడియోలో 7వ తరగతి విద్యార్థి పాపులర్ సాంగ్ దిల్బర్‌కు బెల్లీ డ్యాన్స్ చేస్తున్నాడు.ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌ లోని గౌరెలా-పెండ్రా-మార్వాహి జిల్లాలోని సర్ఖోర్ పెండ్రా అనే ప్రభుత్వ పాఠశాలలో చిత్రీకరించారు.ఒరిజినల్ పాటలో నోరా ఫతేహి ఎలా చేసిందో అదే విధంగా తన శరీరాన్ని తిప్పితూ ఈ కుర్రాడు కేక పుట్టించాడు.7వ తరగతి చదువుతున్న ఈ డ్యాన్సర్ పేరు వివేక్.అతని బెల్లీ డ్యాన్సింగ్ చూసి అతని చుట్టూ నిలబడి ఉన్న వ్యక్తులు ఆశ్చర్యచకితులయ్యారు.ఇది అతనిలో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

దీంతో అతడు మరింత గొప్పగా డ్యాన్స్ చేస్తూ అందరి మనసులను దోచేశాడు.

డ్యాన్స్ లో వివేక్ నైపుణ్యం చూస్తే శిక్షణ పొందిన డ్యాన్సర్‌ని తలపించేలా ఉంది.అయితే, వాస్తవానికి అతను కేవలం 7వ తరగతి విద్యార్థి.అయినప్పటికీ పుట్టుకతోనే డాన్స్ చేయడం వచ్చినట్లు అద్భుతంగా స్టెప్పులు వేస్తూ ఆశ్చర్యపరిచాడు.

ఈ వీడియోని మొదట ఒక జర్నలిస్టు షేర్ చేశాడు.అదే వీడియో ని తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!

దీంతో ఈ వీడియోని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.భారతదేశంలో అసలైన టాలెంట్ అంటే ఇదే అని, చాలా గ్రేట్ టాలెంట్ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

తాజా వార్తలు