వీడియో: తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని ఎంత బాగా డ్యాన్స్ చేసిందో..

సోషల్ మీడియాలో ప్రజలు గుర్తింపు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతున్నారు.కొందరు డ్యాన్స్ చేస్తూ పాపులర్ అవుతుండగా, మరికొందరు వింత ప్రయోగాలు చేస్తున్నారు.

 Video How Well She Danced With A Gas Cylinder On Her Head , Viral Video, Viral N-TeluguStop.com

యువకులైతే స్టంట్స్ చేయడం, రిస్కీ ప్లేస్ లో సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు.ఈ ప్రయత్నాలన్నీ సోషల్ మీడియాలో గుర్తింపు పొందడానికి కొంతమంది వ్యక్తులు చేస్తున్న విపరీతమైన పనులకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఇక మనం సోషల్ మీడియాలో చూసే కొంతమంది ప్రజలు మాత్రం చాలా వినూత్నమైన విన్యాసాలు చేస్తారు.ఇలాంటి విన్యాసాలను చూసినప్పుడు, వారు మంత్రాలను ఉపయోగిస్తున్నారా అని అనుకునేంత ఆశ్చర్యకరంగా ఉంటాయి.

ఇలాంటి విన్యాసాలను చూసినప్పుడు, వారికున్న నైపుణ్యం, ధైర్యం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.తాజాగా అలాంటి విన్యాసాలు చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

అందులో ఓ మహిళ ఖాళీ సిలిండర్‌ను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ అబ్బురపరిచింది.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే, తలపై ఓ ఖాళీ సిలిండర్‌ను( empty cylinder ) పెట్టుకున్న ఓ మహిళను మనం చూడవచ్చు.ఖాళీ సిలిండర్ అయినా అది బరువుగా, తలపై బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది.అయితే సదరు మహిళ దాన్ని నెత్తిపై పెట్టుకోవడమే కాక డ్యాన్స్ కూడా చేసి వావ్ అనిపించింది.

సిలిండర్‌ను బ్యాలెన్స్ చేస్తూనే చక్కగా స్టెప్పులు వేసింది.అంతేకాదు, బోర్లించిన ఓ గిన్నె పైకి కూడా ఎక్కి రౌండ్లు తిరుగుతూ డ్యాన్స్ చేయడం కంటిన్యూ చేసింది.

చిన్న బిందెపై ఒంటి కాలుపై నిల్చొని కూడా కాలు కదిపింది.

వీడియో చూసిన నెటిజన్లు ఇంతవరకు ఇలాంటి ఛాలెంజింగ్ డ్యాన్స్ తమెప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు.కొందరు నెటిజన్లు ఆమె టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు.అయితే, ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు ఎవరూ చేయకూడదని కొందరు హెచ్చరిస్తున్నారు.

ఈ మహిళ అంటే చాలా చక్కగా సిలిండర్‌ను బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేశారు కానీ ఇతరులకు అది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.సిలిండర్ కొంచెం పక్కకు ఒరిగినా అది కిందపడిపోయి గాయాలు లేదా ప్రమాదం జరగవచ్చని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube