వీడియో: బస్సు డ్రైవర్‌తో మందు బాబు గొడవ.. స్టీరింగ్ తిప్పేయడంతో పెద్ద యాక్సిడెంట్..!

నిన్న ఆదివారం సాయంత్రం, ముంబైలో( Mumbai ) ఓ దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది.

కమలేష్ ప్రజాపతి ( Kamlesh Prajapati )అనే బస్సు డ్రైవర్‌తో ఓ ప్రయాణికుడు గొడవ పెట్టుకున్నాడు.

తాగిన మత్తులో ఉన్న ఆ ప్రయాణికుడి స్టీరింగ్ ఇష్టం వచ్చినట్లు తిప్పేసి పెద్ద ప్రమాదానికి దారి తీశాడు.ఈ యాక్సిడెంట్ రాత్రి 8:30 గంటల సమయంలో లాల్‌బాగ్ సిగ్నల్ ( Lalbagh signal )దగ్గర ఉన్న గణేష్ టాకీస్ సమీపంలో జరిగింది.కమలేష్ ప్రజాపతి (40) బ్రిటిష్ ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఎలక్ట్రిక్ మిడి బస్సును( British Electric Supply and Transport Electric Midi Bus ) నడుపుతున్నారు.

ఆ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.లోకల్ మీడియా ప్రకారం, మద్యం తాగిన దత్తా మురళీధర్ శిందే అనే 40 ఏళ్ల వ్యక్తి, బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు.

కోపంతో ఆగలేక, శిందే స్టీరింగ్ వీల్‌ను లాక్కొని బస్సును రోడ్డు నుంచి దారి మళ్లించాడు.డ్రైవర్ బస్సు పైన పూర్తిగా కంట్రోల్ కోల్పోయాడు.దాంతో ఆ బస్సు అనేక వాహనాలను ఢీకొట్టింది.కార్లు, స్కూటర్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

అంతేకాకుండా, ఇది రోడ్డు దాటేవారిని కూడా గుద్దింది.ఈ ప్రమాదం చాలా బలంగా జరిగింది.

ఫలితంగా వాహనాలు బాగా డ్యామేజ్ అయ్యాయి.చాలా మంది గాయపడ్డారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక మహిళ చికిత్స పొందుతూ మరణించింది.

ఇంకా చాలా మందికి గాయాలు అయ్యాయి.ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

శిందే ఎలా డ్రైవర్‌ను అదుపు చేశాడు, ఆ సమయంలో అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అనే విషయాలపై దృష్టి సారించారు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

ఈ రోజుల్లో ఇండియాలో పబ్లిక్ ప్లేసుల్లో భద్రత అనేది చాలా కరువైపోయింది.దొంగలు రౌడీలు ఆగతాయిలో కామాంధులు, తాగుబోతులు, రెక్‌లెస్ డ్రైవర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరేంటి అందరి నుంచి అమాయక ప్రజలకు ముప్పు పొంచి ఉంటోంది.ఒంటరిగా బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఇండియాలో నెలకొన్నాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు