కస్టమర్లకు హెచ్చరిక చేస్తోన్న వీఐ!

వోడాఫోన్‌ ఐడియా (వీఐ) తమ కస్టమర్లకు వార్నింగ్‌ నోటీసును జారీ చేసింది.పెరుగుతున్న హ్యాకర్ల దాడితో వినియోగదారులను జాగ్రత్తగా ఉండాలని కోరింది.

స్కామర్లు కేవైసీ అప్డేట్‌ అంటూ మోసాలకు పాల్పడుతున్నారని వివరించింది.ఈ విషయం ఓ వీఐ వినియోగదారుడి కంప్లైయింట్‌ ద్వారా తెలిసిందని, వీఐ కస్టమర్లకు గుర్తు తెలియని ఫోన్‌ నంబర్ల ద్వారా కాల్స్‌ లేదా మెసేజ్‌లు వస్తున్నాయని.

VI Warns Customers Against KYC Update , Fraud Kyc Link , Idea , Update Kyc Link

వారు కేవైసీని తక్షణమే అప్డేడ్‌ చేయాలని చెబుతున్నట్లు వీఐ తెలిపింది.ఇటీవల ఫేక్‌ ఎస్‌ఎంఎస్‌ల విషయంలో కూడా వీఐ తమ వినియోగదారులకు హెచ్చరికలు చేసింది.

హ్యాకర్లు ఫోన్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ రూపంలో సిమ్‌ కార్డ్‌ బ్లాక్‌ అవుతుంది వీఐ కస్టమర్లు వెంటనే కేవైసీ అప్డేట్‌ చేసుకోవాలని ఇచ్చిన డాక్యుమెంట్ల వివరాలు సరిపోవని లేదా అవి పెండింగ్‌లో ఉన్నాయనో లేదా ఎక్స్‌పైర్‌ అయిపోయాయని స్కామర్లు మోసాలకు పాల్పడటానికి ప్రయత్నిస్తున్నారు.రిలయన్స్‌ జియో కూడా ఈ విషయంలో తమ కస్టమర్లకు హెచ్చరిక చేసింది.

Advertisement

అంతేకాదు హ్యాకర్లు కంపెనీ రిప్రెసెంటేటివ్స్‌ అని వెంటనే కేవైసీ అప్డేట్‌ చేసుకోకపోతే సిమ్‌ కార్డు బ్లాక్‌ చేస్తామని భయపెడుతున్నారు.వీరు ముఖ్యంగా వెరిఫికేషన్‌ పేరుతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారని వీఐ తెలిపింది.

అందుకే వినియోగదారులు అటువంటి మోసాల బారినపడకుండా ఉండటానికి ఈ హెచ్చరిక చేస్తోంది.ముఖ్యంగా తెలియని అనధికార నంబర్ల నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌ కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

వీఐ వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ కేవైసీ వివరాలు ఇవ్వద్దని, మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని షేర్‌ చేయవద్దని చెప్పింది.అంతేకాదు సదరు ఫోన్‌ నంబర్లకు కాల్‌ బ్యాక్‌ కూడా చేయవద్దని, ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపించే ఎటువంటి లింక్‌లను క్లిక్‌ చేయకూడదని తెలిపింది.

దీనిపై స్పందించిన టెలికమ్‌ ఆపరేటర్స్‌ యూజర్లు అనధికారిక మొబైల్‌ నంబర్ల ద్వారా వచ్చే ఎస్‌ఎంఎస్‌ల లింక్‌లను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదని సూచించింది.తద్వారా మీకు సంబంధించిన డేటా లేదా ఇన్ఫర్మేషన్‌ మొబైల్‌ డిౖÐð జ్‌ ద్వారా తస్కరణకు గురవుతుందనిఇది చాలా సమస్యలకు దారితీస్తుందని చెప్పారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

వినియోగదారుల సమాచార సేవకరణ కంపెనీలు కేవలం ఎస్‌ఎంఎస్‌ ఐడీవీఐకేర్‌నుంచే జరుగుతుందని తెలిపింది.కానీ, వీఐ కేర్‌ నుంచి వచ్చిన ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దని సూచించింది.

Advertisement

వీఐ కస్టమర్లకు ఎంతో నమ్మశక్యమైన కంపెనీ అని తెలిపింది.

తాజా వార్తలు