తెలంగాణ కాంగ్రెస్ లో ఒకరితో వివాదం సద్దుమణిగితే మరొకరి వ్యాఖ్యలతో వివాదం చెలరేగుతోంది.అయితే ప్రస్తుతం తాజాగా కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి భేటీతో ఇక అందరూ కలిసి పోయినారని భావించినా తాజాగా వారి భేటీపై వీహెచ్ పరోక్షంగా సెటైర్ లు వేసిన పరిస్థితి ఉంది.
ఇద్దరు రెడ్లు కలిస్తే అది అంత పెద్ద విషయం కాదంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో మరోసారి అగ్గి రాజేసిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా కేసీఆర్ జన్మదిన వేడుకలను సంతాప దినాలుగా కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే.
అయితే కేసీఆర్ జన్మదిన వేడుకలను సంతాప దినాలుగా చేయడం ఏంటని పుట్టిన రోజున శాపనార్థాలు పెట్టడం కరెక్ట్ కాదని వీహెచ్ స్వంత పార్టీ నేతలపైనే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి.
అయితే రెడ్లు అందరూ చుట్టాలేనని వాళ్ళు తరచూ కలుస్తూ ఉంటారని చేసిన వ్యాఖ్యలతో ఇక కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం రావడం చాలా కష్టమనే భావన చాలా మంది రాజకీయ విశ్లేషకులలో కలుగుతోంది.
అయితే ప్రస్తుతం జగ్గారెడ్డి కూడా వీహెచ్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన పరిస్థితిలలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒంటి కాలుపై కెసీఆర్ టార్గెట్ గా విరుచుకపడుతున్న పరిస్థితులలో స్వంత పార్టీ నేతలు పీసీసీ చీఫ్ నిర్ణయాలను ధిక్కరించి మాట్లాడుతున్న పరిస్థితులలో ఇప్పటికే హైకమాండ్ కు రేవంత్ వర్గం ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది.
అయితే హైకమాండ్ పీసీసీ చీఫ్ నిర్ణయాలను ధిక్కరించవద్దని తెలిపినా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఇలాంటి అంతర్గత విభేదాలు స్వంత పార్టీనేతలపై వ్యాఖ్యలు అనేవి ఎంత హైకమాండ్ నిలువరించాలని చూసినా ఆగే అవకాశం లేదు.