కేవలం 100 లేదా అంతకంటే కాస్త ఎక్కువ సీసీ గల స్కూటర్లు మాత్రమే భారత మార్కెట్లో ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి.అయితే ఈ ఏడాది నుంచి 300సీసీ, అంతకన్నా ఎక్కువ సీసీ ఇంజన్లతో స్కూటర్లు అందుబాటులోకి రావడానికి సిద్ధమయ్యాయి.
భారత స్కూటర్ రంగంలో టాప్ ప్లేస్‌లో ఉన్న వెస్పా కూడా హై ఎండ్ ఇంజన్ తీసుకురావడానికి సిద్ధమైంది.ఈ కంపెనీ కొత్త వెస్పా GTS 300cc స్కూటర్‌ను రిలీజ్ చేయడానికి ముందడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా భారతదేశంలో టెస్టింగ్ కూడా చేసిందని సమాచారం.
నిజానికి వెస్పా 300cc ఇంజన్‌పై పనిచేస్తోందని 2020 నుంచి అనేక ఊహాగానాలు వస్తున్నాయి.కోవిడ్-19 తర్వాత ఆర్థిక సంక్షోభం కారణంగా, ఈ అభివృద్ధి కొంతవరకు మ్యూట్ చేయబడింది.కానీ 2023లో ఇది విడుదలవుతుందని సమాచారం.
వెస్పా GTS 300cc స్కూటర్ టూరింగ్-ఓరియెంటెడ్‌గా అందుబాటులోకి వస్తుంది.
అందువల్ల రైడర్, పిలియన్ ఇద్దరికీ చాలా స్థలాన్ని అందిస్తుంది.ఈ స్కూటర్ గ్లోబల్ మోడల్స్ ఫ్రంట్, బ్యాక్ రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌లను ఉండొచ్చు.భారతదేశంలో టెస్ట్ చేసిన ఈ స్కూటర్ వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
కాస్త తక్కువ ధరలో ఇండియన్స్ ఈ స్కూటర్ ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో డ్రమ్ బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది.
అలానే ఇండియన్ వెర్షన్ ఎయిర్-కూల్డ్ యూనిట్ అయితే, ప్రపంచవ్యాప్తంగా, వెస్పా లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అందిస్తుంది.ఇంటర్నేషనల్ స్పెక్ మోడల్‌తో పోలిస్తే ఇండియా వెర్షన్‌లో ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్‌తో సహా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మారవచ్చు.దీని ధర రూ.3 – 3.5 లక్షలు ఉండొచ్చని సమాచారం.