2023లో వెస్పా 300సీసీ స్కూటర్ లాంచ్.. ఆ వివరాలివే..!

కేవలం 100 లేదా అంతకంటే కాస్త ఎక్కువ సీసీ గల స్కూటర్లు మాత్రమే భారత మార్కెట్లో ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి.

అయితే ఈ ఏడాది నుంచి 300సీసీ, అంతకన్నా ఎక్కువ సీసీ ఇంజన్లతో స్కూటర్లు అందుబాటులోకి రావడానికి సిద్ధమయ్యాయి.

భారత స్కూటర్ రంగంలో టాప్ ప్లేస్‌లో ఉన్న వెస్పా కూడా హై ఎండ్ ఇంజన్ తీసుకురావడానికి సిద్ధమైంది.

ఈ కంపెనీ కొత్త వెస్పా GTS 300cc స్కూటర్‌ను రిలీజ్ చేయడానికి ముందడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా భారతదేశంలో టెస్టింగ్ కూడా చేసిందని సమాచారం.నిజానికి వెస్పా 300cc ఇంజన్‌పై పనిచేస్తోందని 2020 నుంచి అనేక ఊహాగానాలు వస్తున్నాయి.

కోవిడ్-19 తర్వాత ఆర్థిక సంక్షోభం కారణంగా, ఈ అభివృద్ధి కొంతవరకు మ్యూట్ చేయబడింది.

కానీ 2023లో ఇది విడుదలవుతుందని సమాచారం.వెస్పా GTS 300cc స్కూటర్ టూరింగ్-ఓరియెంటెడ్‌గా అందుబాటులోకి వస్తుంది.

"""/"/అందువల్ల రైడర్, పిలియన్ ఇద్దరికీ చాలా స్థలాన్ని అందిస్తుంది.ఈ స్కూటర్ గ్లోబల్ మోడల్స్ ఫ్రంట్, బ్యాక్ రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌లను ఉండొచ్చు.

భారతదేశంలో టెస్ట్ చేసిన ఈ స్కూటర్ వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.కాస్త తక్కువ ధరలో ఇండియన్స్ ఈ స్కూటర్ ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో డ్రమ్‌ బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది.

"""/"/ అలానే ఇండియన్ వెర్షన్ ఎయిర్-కూల్డ్ యూనిట్ అయితే, ప్రపంచవ్యాప్తంగా, వెస్పా లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అందిస్తుంది.

ఇంటర్నేషనల్ స్పెక్ మోడల్‌తో పోలిస్తే ఇండియా వెర్షన్‌లో ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్‌తో సహా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మారవచ్చు.

దీని ధర రూ.3 - 3.

5 లక్షలు ఉండొచ్చని సమాచారం.

వారానికి ఒక్కసారి ఈ పవర్ ఫుల్ టానిక్ ను వాడితే లాగిన మీ జుట్టు ఊడదు..!