రానా నాయుడు వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో వెంకటేష్ ఎటువంటి సినిమాలలో నటించలేదు.

 Venkatesh Ranas Rana Naidu High Trailer Talk And Streaming Date Fix Details, Ven-TeluguStop.com

తోటి హీరోలతో కలిసి మల్టి స్టారర్ సినిమాలలో నటిస్తున్నారు.కాగా గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్ ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాలో నటించాడు.

ఇది ఇలా ఉంటే వెంకటేష్ హీరో రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ను పూర్తి చేశారు.కాగా ఈ వెబ్ సీరిస్ తెలుగుతో పాటు హిందీ, తమిళం అలాగే ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు.

Telugu Netflix, Rana, Rana Daggubati, Rana Netflix, Rana Web, Tollywood, Venkate

కాగా గతంలో రానా, వెంకటేష్ కృష్ణం వందే జగద్గురుం సినిమాలో ఒక పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు.కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు.కాగా తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.

ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు.రానా ఇది వరకు కనిపించని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు.

ఇక నాగ పాత్రలో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ ‌లుక్‌లో కేక పుట్టిస్తున్నాడు.తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసారు.

తండ్రి అంటే పడని కొడుకు పాత్రలో రానా నటించారు.

Telugu Netflix, Rana, Rana Daggubati, Rana Netflix, Rana Web, Tollywood, Venkate

ఈ వెబ్ సిరీస్ మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.వెంకటేష్, రానాలకు ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్.కాగా ఈ సిరీస్ అమెరికన్ సిరీస్ రే డోనోవన్‌కు భారతీయ అడాప్షన్ అని చెప్పవచ్చు.

ఇకపోతే రానా చివరగా విరాట పర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత రానా మరే ఇతర సినిమాలలో నటించలేదు.ఈ వెబ్ సిరీస్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube