టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ మధ్య కాలంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం తమిళంలో సూపర్ సక్సెస్ అయిన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ అనే టైటిల్‌తో రీమేక్ చేస్తున్న వెంకీ, తన నెక్ట్స్ చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టాటు.
ఇందులో భాగంగా ఓ క్రేజీ కాంబోలో వెంకీ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లు పలు హిట్ చిత్రాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.అందులో సుందరకాండ, కూలీ నెంబర్ వన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి.
ఇక చివరిసారిగా వీరిద్దరి కాంబినేషన్‌లో 2005లో సుభాష్ చంద్రబోస్ అనే సినిమా వచ్చింది.అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు.
ఇక రాఘవేంద్ర రావు కూడా సినిమాలను బాగా తగ్గించడంతో ఇప్పుడు మరోసారి సినిమాను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
వెంకటేష్‌తో కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించాలని రాఘవేంద్రరావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.కాగా ప్రస్తుతం వెంకీ నటిస్తోన్న నారప్ప చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండగా ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి చేసుకుంది.