నారప్ప డైరెక్టర్ కు వెంకీ సలహాలు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాల హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ తాజాగా “నారప్ప” సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అవడంతో, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Venkatesh, Sreekanth Addala, Narappa, Tollywood,south Cinema,latets News-TeluguStop.com

త‌మిళ సూప‌ర్‌హిట్ మూవీ అసుర‌న్‌కు ఇది తెలుగు రీమేక్‌.సున్నిత‌బావోద్వేగాల క‌థాంశాల‌ను ఎంతో అద్భుతంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.

నార‌ప్ప లాంటి రివేంజ్ డ్రామాను ఏ విధంగా సిల్వ‌ర్‌స్క్రీన్‌ పై చూపిస్తాడోన‌ని చాలా మంది ఈ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం నారప్ప సినిమాకు సంబంధించిన విషయం ఒకటి సినీ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.

నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేయకుండా ఒరిజినల్ వెర్షన్ లోని ఈ సినిమాను తెరకెక్కించాలని హీరో విక్టరీ వెంకటేష్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే తాజాగా విడుదలైన నారప్ప టీజర్ చూస్తుంటే వెంకటేష్ చెప్పిన మాటలను తూచా తప్పకుండా శ్రీకాంత్ అడ్డాల పాటించినట్లు తెలుస్తోంది.

ఎలాంటి పాత్రలోనైనా ఎంతో అవలీలగా ఒదిగిపోయే 100% ఆ పాత్రకు న్యాయం చేసే విక్టరీ వెంకటేష్ నారప్ప గా అసుర‌న్ ను మించి రికార్డులు క్రియేట్ చేస్తాడా.?  లేదా అన్న‌ది చూడాలి.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఎఫ్3 సినిమాలో వెంకటేష్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే ఎఫ్ 3 కూడా ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.ఈ వేసవిలో ఏకంగా వెంకటేష్ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube