వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎఫ్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మే 27 వ తారీఖున ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లు గా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమా ట్రైలర్ ను రేపు విడుదల చేయబోతున్నారు అనే విషయం తెలిసిందే.సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నా కూడా దర్శకుడు అనిల్ రావిపూడి మరియు ఇతర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ చూపించడం లేదు.
దాంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో ప్రేక్షకులు మరియు యూనిట్ సభ్యులు అసంతృప్తితో ఉన్నారని టాక్ వినిపిస్తుంది.అయితే అసలు విషయం ఏంటంటే దర్శకుడు అనిల్ రావిపూడి తో మహేష్ బాబు గతంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేశాడు.

ఆ అభిమానంతోనే ఇప్పుడు మహేష్ బాబు నటించి విడుదల కాబోతున్న సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కి అడ్డు రావద్దు అనే ఉద్దేశంతో తన ఎఫ్ 3 సినిమా కాస్త సైలెంట్ గా ఉంచుతూ వస్తున్నాడట.ఎప్పుడైతే సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో అప్పుడు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ చేస్తాడని సమాచారం అందుతోంది.ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కు ఓ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇదే సమయం లో తమ ఎఫ్ 3 సినిమా కు కూడా ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం వల్ల మీడియా లో రెండు సినిమాలకు సరైన పబ్లిసిటీ దక్కకుండా నష్టం జరిగే అవకాశం ఉంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కనుక సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ వరుణ్ తేజ్ సినిమా విడుదలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.







