మన టాలీవుడ్ లో ఎంత మంది ముద్దుగుమ్మలు ఉన్నప్పటికీ ఈమె మాత్రం అందరికి స్పెషన్ నే.ఈమెకు హీరోల మాదిరిగా స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.
అలా అని ఈమె చాలా సినిమాలు చేసింది అని అనుకోకండి.ఈమె చేసింది కొద్దీ సినిమాలే అయినప్పటికీ ఈమె మాత్రం అందరికి ఫెవరెట్ యాక్ట్రెస్.
ఇంకా చెప్పాలంటే న్యాచురల్ బ్యూటీ ఎవరు అని అడిగితే వెంటనే ఈమె పేరు గుర్తుకు వస్తుంది.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది అనుకుంటా.
ఈమె మరెవరో కాదు.ఫిదా తో అందరిని ఫిదా చేసి అందరి చేత శబాష్ అనిపించుకున్న ముద్దు గుమ్మా సాయి పల్లవి.
ఈమె గురించి ఎంత చెప్పిన తక్కువే.ఈమె ఆ సినిమాలో భానుమతి సింగిల్ పీస్ అంటూ ఎలా డైలాగ్ చెప్పిందో అలానే ఈమె నిజజీవితంలో కూడా ఉంటుంది.
ఈమె లాగా మరే హీరోయిన్ ఉండదు అంటే అతియసోక్తి కాదేమో.ఈ రోజుల్లో హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ కు ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే చాలు ఏ క్యారెక్టర్ అయినా ఓకే అని ప్రొసీడ్ అవుతూ ఉంటారు.
కానీ సాయి పల్లవి అందరిలా కాదు.

ఈమె తనకు నచ్చకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా కూడా వద్దు అని ముఖం మీదే చెప్పే దైర్యం కలది.ఇప్పటికే ఈమె కథ నచ్చలేదని చాలా సినిమాలను వదులుకుంది.ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.
ఇక ఇటీవల కాలంలో ఈమెపై చాలా రూమర్స్ వస్తున్నాయి.సినిమాలు మానేసిందని, పెళ్లి చేసుకోబోతుంది అంటూ వరుస రూమర్స్ వస్తున్నాయి.

అయితే ఈమె నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.అయితే తాజాగా సాయి పల్లవి ఒక ఫోటో షేర్ చేసింది.ఈ ఫొటో ను చుసిన ఫ్యాన్స్ సతమతం అవుతున్నారు.అంతగా ఏముంది అంటే.
ఈ ఫొటోలో కేవలం సాయి పల్లవి పరిగెడుతున్నట్టుగా చూపించారు.ఎం కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి.
మరి ఈ ఫోటో విరాట పర్వం సినిమాలోది అని కొంత మంది అంటుంటే.మరి కొంత మంది మాత్రం కొత్త సినిమా లోనిది అంటున్నారు.
అయితే ఈ ఫోటో గురించి ఈమె 9న చెబుతాను అని అందరిని సస్పెన్స్ లోకి నెట్టేసింది.మరి ఈ ఫోటోను చూసి మీకేమి అనిపిస్తుందో చెప్పండి.







