బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లు ఏవనే ప్రశ్నకు అఖండ, వీరసింహారెడ్డి సినిమాల పేర్లు వినిపిస్తాయి.అయితే అఖండ ఫుల్ రన్ లో సాధించిన కలెక్షన్లను వీరసింహారెడ్డి మూవీ 8 రోజుల్లో బ్రేక్ చేసింది.
తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలైనప్పటికీ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.అఖండ రికార్డ్ ను వీరసింహారెడ్డి బ్రేక్ చేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
అయితే బాలయ్య కెరీర్ లో ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను అందుకున్న సినిమా అయితే లేదు.వీరసింహారెడ్డి సినిమా సెకండ్ వీకెండ్ లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రం ఈ రికార్డ్ ను సొంతం చేసుకోవడం కష్టమైతే కాదు.
బాలయ్య ఈ అరుదైన రికార్డ్ ను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలయ్య సినిమాకు మరో లాంగ్ వీకెండ్ ప్లస్ కానుంది.
బాలయ్య ఈ రికార్డ్ ను అందుకోవాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు.బాలయ్య ఏదైనా రీజన్ వల్ల ఈ రికార్డ్ ను అందుకోని పక్షంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బాలయ్య ఖాతాలో రికార్డ్ కచ్చితంగా చేరే ఛాన్స్ అయితే ఉంది.సాధారణంగా అనిల్ రావిపూడి వేగంగా సినిమాలను తెరకెక్కిస్తారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.ఈ సినిమా బాలయ్య సినిమాల బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఏదైనా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య సినిమాలు వరుస విజయాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.