నందమూరి బాలకృష్ణ తనకు నచ్చితే ఎంత క్లోజ్ గా ఉంటారో.నచ్చకపోతే మాత్రం అంతే దూరం పెడతారు.
మాములుగా సరదాగా కనిపించే బాలకృష్ణకు ఎప్పుడైతే కోపం వస్తే ఎలా ఉంటుందో ఆయన చేతి వాటం చూస్తే అర్ధమవుతుంది.అయితే షూటింగ్ లొకేషన్స్ లో మాత్రం బాలయ్య చాలా కూల్ గా డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టుగానే చేస్తాడట.
అయితే వీర సింహా రెడ్డి సినిమా విషయంలో మాత్రం తనకు నచ్చిన కెమెరా మెన్ ని పక్కన పెట్టి తనకు కన్వినెంట్ గా ఉండే మరో కెమెరా మెన్ ని తీసుకున్నారట.
గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీర సింహా రెడ్డి సినిమాకు రిషి పంజాబి కెమెరా మెన్ గా పనిచేశారు.
అయితే సినిమా జరుగుతున్న టైం లో బాలయ్యకి అతనికి సింక్ కుదరలేదట.అందుకే బాలకృష్ణ కు నచ్చిన రాం ప్రసాద్ నే కెమెరా మెన్ గా తీసుకున్నారట.
అయితే రిషిని ఎలాగు తీసుకున్నారు కాబట్టి బాలకృష్ణ లేని సీన్స్ అన్ని రిషితో లాగించారట.సో వీర సింహా రెడ్డికి ఇద్దరు కెమెరా మెన్ లు పనిచేసినట్టు తెలుస్తుంది.
బాలయ్యకి నచ్చకపోతే అంతే అంటూ విషయం తెలిసిన వారు కామెంట్ చేస్తున్నారు.







