నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’.ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఎందుకంటే అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య ఈ సినిమా తోనే రాబోతున్నాడు.అందుకే ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యి కేవలం ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.
మరొక పక్క సాంగ్ కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మేకర్స్ మరో సాంగ్ ను రిలీజ్ చేసారు.
ఇప్పటికే జై బాలయ్య అనే సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఇక ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేసారు.
ఈ రోజు ఉదయం రెండవ పాట రిలీజ్ అయ్యింది.బాలయ్య, శృతి కాంబోలో వచ్చిన ఈ రొమాంటిక్ పాట ”సుగుణ సుందరి” ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ సాంగ్ స్టార్టింగ్ బీట్ నుండే బాలయ్య ఇంకా శృతి హాసన్ లు అదిరే డ్యాన్స్ మూవ్స్ తో నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అందరిని థ్రిల్ చేసేసారు.బాలయ్య వింటేజ్ లుక్ అదిరిపోయింది అనే చెప్పాలి.థమన్ ఇచ్చిన ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది.

ఇక సుగుణ సుందరి సాంగ్ కు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయగా బాలయ్యకు తగ్గ స్టెప్స్ పర్ఫెక్ట్ గా సెట్ చేసాడు.దీంతో ఈ సాంగ్ అలరిస్తుంది.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.
కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే.







