'VD11'.. లాంచింగ్ కు సామ్ మిస్సింగ్ ఎందుకంటే?

విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబోలో ఒక సినిమా వస్తుంది.ఈ సినిమా వస్తుంది అని ఎన్నో రోజులుగా వినిపిస్తున్న ఈ రోజు లాంఛనంగా స్టార్ట్ చేసారు.

 Vd11 Sam Missing For Launch-TeluguStop.com

విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తుంది.

ఇప్పటికే మేకర్స్ లొకేషన్స్ ను కూడా ఫైనల్ చేశారట.ఎక్కువ భాగం కాశ్మీర్ లోనే జరగనుంది.

ఈ సినిమా స్టార్ట్ అవ్వడంతోనే అంచనాలు భారీగా పెరిగాయి.విజయ్, సమంత జోడీ అంటే మరింత ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.విజయ్ కెరీర్ లో ఈ సినిమా 11వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఈ రోజు గ్రాండ్ గా జరిగిన లాంచింగ్ ప్రోగ్రాం లో సమంత ఎక్కడ కూడా కనిపించ లేదు.

దీంతో ఈమె ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియా వేదికగా అప్పుడే ఆరా తీయడం మొదలు పెట్టారు.

Telugu Kashmir, Samantharuth, Shiva Nirvana, Thailand-Movie

ఈమె ఎందుకు రాలేదా అనే అనుమానం వచ్చింది.అయితే ఈ ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది.ప్రెసెంట్ సమంత వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈమె వెకేషన్ కోసం ఆమె సోదరితో కలిసి థాయిలాండ్ కు వెళ్ళింది.గత కొన్ని రోజులుగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Telugu Kashmir, Samantharuth, Shiva Nirvana, Thailand-Movie

అందుకే సమంత తన కొత్త సినిమా లాంచింగ్ ఫంక్షన్ కు రాలేదని తెలుస్తుంది.ఇక సామ్ స్పీడ్ చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు.ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు వరుస వెకేషన్స్ కు వెళ్తూ క్షణం కూడా కాళీ లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది.తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube