Gandeevadhari Arjuna Review: గాండీవధారి అర్జున రివ్యూ: మూవీ ఎలా ఉందంటే?

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన సినిమా గాండీవధారి అర్జున.( Gandeevadhari Arjuna ) ఈ సినిమాలో వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, వినయ్ రాయ్, విమల రామన్, అభినవ్ గోమఠం తదితరులు నటించారు.

 Varun Tej Sakshi Vaidya Gandeevadhari Arjuna Movie Review And Rating-TeluguStop.com

బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా ముఖేష్ జి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి.దీంతో ఈ సినిమా ఈరోజు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.కథ మొత్తం లండన్ లో జరుగుతుంది.అయితే అక్కడ జరిగే గ్లోబల్ సమ్మిట్ 2023కి భారత్ నుండి కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బహదూర్ (నాజర్)( Nassar ) వెళ్తాడు.

ఐఏఎస్ అధికారిని ఐరా (సాక్షి వైద్య) ( Sakshi Vaidya ) ఆదిత్య రాజ్ బహదూర్ కు పీఏగా వెళ్తుంది.అయితే లండన్ లో ఉన్న ఆదిత్య రాజ్ కు శృతి (రోషణి ప్రకాష్) ఒక పెన్ డ్రైవ్ (ఫైల్ 13) ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

అదే సమయంలో తనను క్లీన్ అండ్ గ్రీన్ (సి అండ్ జి ) కంపెనీ అధినేత రణవీర్ (వినయ్ రాయ్) మనుషులు వెంటాడుతారు.ఆ పెన్ డ్రైవ్ ను మంత్రికి ఇవ్వకుండా ఆపుతారు.

అయితే మంత్రిపై ఓసారి అటాక్ జరుగుతుంది.దీంతో మంత్రికి సెక్యూరిటీగా అర్జున్ వర్మ (వరుణ్ తేజ్)( Varun Tej ) వస్తాడు.

ఇక ఆదిత్య రాజ్ కి శృతి ఆ పెన్ డ్రైవ్ ఎందుకు ఇవ్వాలనుకుంటుంది.తనను రణవీర్ మనిషిని ఎందుకు అడ్డుపడతారు.

ఐరా అర్జున్ కి ఎలా పరిచయం అవుతుంది.ఇంతకు మంత్రిపై జరిగిన అటాక్ ఎవరు చేయించారు అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

నటీనటుల నటన విషయానికి వస్తే.అర్జున్ వర్మ పాత్రలో వరుణ్ తేజ్ బాగా నటించాడు.ఈసారి చాలా స్టైలిష్ గా కూడా కనిపించాడు.ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో బాగా అదరగొట్టాడు.పీఏ పాత్రలో ఐరాగా సాక్షి కూడా బాగానే పర్ఫామెన్స్ చేసింది.నాజర్ తన పాత్రలో లీనమయ్యాడు.

ఇక నెగిటివ్ పాత్రలో నటించిన విజయ్ రాయ్ విలనిజం చూపించడంలో ఫెయిల్ అయ్యాడు.మిగతా వాళ్లంతా పాత్రకు తగ్గట్టుగా చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ మంచి కథను తీసుకొచ్చినప్పటికీ.చూపించడంలో విఫలమయ్యాడని చెప్పాలి.మిక్కీ జే మేయర్( Mickey J Mayer ) అందించిన సంగీతం పరవాలేదు.పాటలు కూడా మామూలుగానే ఉన్నాయని చెప్పాలి.సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.

ఎడిటింగ్ కూడా పరవాలేదని చెప్పాలి.ఇక మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

డైరెక్టర్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కథ, కథనాలపై ఇంట్రెస్ట్ కల్పించేలా చూపించాడు.ముఖ్యంగా డిజిటల్ మాఫియా గురించి బాగా చూపించాడు.ముఖ్యంగా ఫారిన్ లో ఉండే చెత్తను ఇండియాలో డంప్ చేయటం, ఇండియా వనరులు నాశనం అవుతుండటం, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైతే వచ్చే ప్రమాదాలు వంటి పాయింట్లను బాగానే తీసుకున్నప్పటికీ చూపించే విధానంలో కాస్త వెనుకబడినట్లు అనిపించింది.

ప్లస్ పాయింట్స్:

యాక్షన్ సన్నివేశాలు, కొన్ని టచ్ అయ్యే పాయింట్స్.

మైనస్ పాయింట్స్:

సినిమా కొత్తగా అనిపించినట్లు లేదు, ఎమోషన్ అంతగా కనెక్ట్ అవ్వలేదు.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ఒకసారి చూస్తే సరిపోతుందని చెప్పాలి.సక్సెస్ పరంగా వరుణ్ తేజ్ కు ఈ సినిమా కలిసి రాలేదన్నట్లుగా అనిపించింది.

రేటింగ్: 2/5

.

Gandeevadhari Arjuna Movie Genuine Public Talk

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube