మాస్ హీరో గోపీచంద్( Gopichand ) శ్రీవాస్ డైరెక్షన్ లో చేసిన సినిమా రామబాణం.( Ramabanam ) ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారని అనుకున్న కాంబినేషన్ కాస్త నిరాశపరచింది.
ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ వస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది ఒక గట్టి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.అయితే రామబాణం సినిమా మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) కాదన్నాకే గోపీచంద్ దగ్గరకు వచ్చిందని అంటున్నారు.
సినిమా రిజల్ట్ చూసి వరుణ్ తేజ్ ఈ సినిమా వదులుకుని మంచి పని చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే గోపీచంద్ కి ఇలాంటి కథ రొటీన్ అనిపించింది కానీ అదే సినిమాలో వరుణ్ తేజ్ చేసుంటే మాత్రం కచ్చితంగా రిజల్ట్ వేరేలా ఉండేదని చెప్పొచ్చు.వరుణ్ తేజ్ అనగానే కథ అదే అయినా స్క్రీన్ ప్రెజెన్స్.సినిమా ఫార్మాట్ మారిపోతుంది అందుకే వరుణ్ తేజ్ రామబాణం చేసి ఉంటే కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యేదని అంటున్నారు.
మరికొందరు మాత్రం కథ రొటీన్ గా ఉన్నప్పుడు ఏ హీరో చేసినా ఫలితం అదే వస్తుందని అంటున్నారు.ఏది ఏమైనా రామబాణం ప్రేక్షకులను చాలా డిజప్పాయింట్ చేసింది.