లండన్ లో షూటింగ్ జరగాల్సిందే.. వరుణ్ తేజ్ సెంటిమెంట్ ?

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఎఫ్ 3 సినిమాతో మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్.

 Varun Tej Londosn Entiment Shooting Varun Tej, London, Sentiment, Tollywood, F3,-TeluguStop.com

అయితే ఎఫ్ 3 సినిమా కంటే విడుదలైన గనీ సినిమా ఉహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే ప్రస్తుతం వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాపై దృష్టిని పెట్టాడు.

తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే వరుణ్ తేజ్ లండన్ చేరుకున్నాడు.వచ్చే వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఇకపోతే సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారు.ప్రస్తుతం ది గోస్ట్ సినిమా విడుదల విషయంలో బిజీబిజీగా ఉన్న ప్రవీణ్ సత్తారు ఈ సినిమా విడుదల తరువాత త్వరలోనే లండన్ కి వెళ్ళనున్నారు.

ఇక అప్పటినుంచి దాదాపు నెల రోజులపాటు లండన్ లో షూటింగ్ ని చేయనున్నారు.కాదా లండన్ లో చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకు అత్యంత కీలకమైనవిగా తెలుస్తోంది.ఆ తర్వాత షూటింగ్ హైదరాబాదులో ఉంటున్నట్లుగా తెలుస్తోంది.బీవీఎస్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Telugu London, Praveen Sathhar, Tollywood, Varun Tej, Venkatesh-Movie

అయితే బీవీఎస్ లండన్ లో సినిమా షూటింగ్ చేస్తే తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అని నిర్మాతకు మంచి సెంటిమెంట్ ఉంది.అందువల్లే నిర్మాత ఈ సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇస్తూ లండన్ లో షూటింగ్ జరుపుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.ఇండస్ట్రీలో మామూలుగా ఇటువంటి సెంటిమెంటును ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.సినిమాల షూటింగ్ విషయంలో రిలీజ్ విషయంలో బాగా నమ్ముతూ ఉంటారు దర్శకనిర్మాతలు.ఇకపోతే తన తదుపరి సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ ఏ విధంగా కనిపిస్తాడో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube