అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమా మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.
ఇక ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు నాలుగేళ్ళ పాటు నిరీక్షించారు.మరి అన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.ఇక ఈ సినిమా ఇక్కడే కాదు.వరల్డ్ వైడ్ గా కూడా మంచి హిట్ అయ్యింది.
ఇన్ని రికార్డులు సాధించిన ఈ సినిమా ఇంకా ఏదొక విషయంలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇక ఈ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత ఓటిటి రిలీజ్ కూడా అయ్యింది.ఓటిటిలో రిలీజ్ అయ్యాక మరింతగా ఆడియెన్స్ ను ఆకట్టుకుని నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది.
ఇక తాజాగా ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా నాన్ స్టాప్ గా ట్రెండింగ్ లో నిలిచింది.మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా టాప్ 10ట్రెండింగ్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా 19వ వారంలో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది.వరల్డ్ వైడ్ గా టాప్ 10 లో నిలవడంతో ట్రిపుల్ ఆర్ మరోసారి వార్తల్లో నిలుస్తుంది.ఇది టాప్ లో నిలవడానికి కారణం ఈ సినిమా తెలుగు వర్షన్ ను రాజమౌళి సమక్షంలో లాస్ ఏజెంల్స్ లో బిగ్గెస్ట్ స్క్రీన్ పై స్పెషల్ స్క్రీనింగ్ వేయడమే అని మేకర్స్ కూడా గర్వంగా చెబుతున్నారు.ఇలా ట్రిపుల్ ఆర్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.







