Varun Tej Lavanya Tripathi: నా మొబైల్ లో లావణ్య పేరు అలా సేవ్ చేసుకున్నాను.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్,( Varun Tej ) హీరోయిన్ లావణ్య త్రిపాఠిల( Lavanya Tripathi ) గురించి మనందరికి తెలిసిందే.

గత కొద్దిరోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఎప్పటినుంచో వీరి పెళ్లికి, డేటింగ్ కి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి ఎంగేజ్మెంట్ వేడుకలు జరిగాయి.ఎంగేజ్మెంట్ తర్వాత కూడా తరచూ సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.

కొన్ని ఏళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.ఎట్టకేలకు ఆ వార్తలన్నింటికి చెక్ పెడుతూ ఎంగేజ్మెంట్ తో ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టేసారు.ఇకపోతే హీరో వరుణ్ తేజ్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం గాండీవధారి అర్జున.

Advertisement

( Gandeevadhari Arjuna ) ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు.

ఎమోషన్స్ లో భాగంగానే తాజాగా చిత్ర బృందం సుమ అడ్డా షోలో( Suma Adda ) పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను పంచుకున్నారు వరుణ్ తేజ్.

ఇక షోలో భాగంగా సుమ కొన్ని ఫోటోలను స్క్రీన్ పై చూపించగా లావణ్య ఫోటో చూడగానే మురిసిపోయారు, సంతోషపడ్డారు వరుణ్ తేజ్.ఇప్పుడు ఒక అమ్మాయి వరుణ్ తేజ్ ని ప్రశ్నిస్తూ మీరు లావణ్య గారి పేరుని ఫోన్ లో ఏమని సేవ్ చేసుకున్నారు అని అడగక లవ్( Lavn ) అని సేవ్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్.వెంటనే సుమ ( Suma ) రిలేషన్ మొదలు కాకముందే అలా సేవ్ చేసుకున్నారా రిలేషన్ తర్వాత నా అని ప్రశ్నించగా.

తనే నా మొబైల్ తీసుకొని షేర్ చేసింది అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళతో సంతోషంగా క్లాప్స్ కొట్టారు.అప్పుడు ఇంకొక అమ్మాయి మీరు లావణ్య గారికి ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటో తెలుసా అనగా ఏమో గుర్తుకులేదు మర్చిపోయాను అని తెలిపారు వరుణ్ తేజ్.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

అప్పుడెప్పుడో ఇచ్చాను అనగా వెంటనే సుమ మాకు ఈ మధ్య తెలిసింది అంటూ సెటైర్ వేసింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు