మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటి లావణ్య త్రిపాఠిల(Lavanya Tripati) వివాహం ఎంతో అంగరంగ వైభవంగా ఇటలీలో జరిగిన సంగతే తెలిసిందే.గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
ఇటలీలో వీరిద్దరూ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నప్పటికీ పెళ్లి తర్వాత హైదరాబాదులో చాలా ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.ఇలా రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలందరూ కూడా హాజరై సందడి చేశారు.
ఇక హైదరాబాదులో వరుణ్ తేజ కుటుంబ సభ్యులు స్నేహితులు సినీ సెలెబ్రిటీల సమక్షంలో ఎంతో ఘనంగా వీరి రిసెప్షన్ కార్యక్రమం జరిగింది.ఇక రిసెప్షన్ తర్వాత ఈ కొత్త దంపతులు హైదరాబాద్ లోనే దీపావళి వేడుకలను జరుపుకున్నారు.మొదటిసారి వరుణ్ తేజ్ తన అత్తారింటికి వెళ్లారు.ఈమె అయోధ్యలో జన్మించినప్పటికీ ప్రస్తుతం తన తల్లితండ్రులు డెహ్రాడూన్ (Dehradun) లో నివసిస్తున్నారు.ఈ క్రమంలోనే నిహారిక తన తల్లిదండ్రులతో పాటు వరుణ్ తేజ్ లావణ్య కూడా డెహ్రాడూన్ వెళ్లారు.ఇలా అక్కడ వీరిద్దరూ తిరిగి మరోసారి రిసెప్షన్ జరుపుకున్నారు.
కేవలం లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.ఈ క్రమంలోనే డెహ్రాడూన్ వెళ్లినటువంటి ఈ దంపతులు మరోసారి రిసెప్షన్ (Reception ) జరుపుకొని లావణ్య త్రిపాఠి బంధువులందరినీ కూడా ఈ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ రిసెప్షన్ వేడుకలలో భాగంగా వరుణ్ తేజ్ వైట్ కలర్ కుర్తా ధరించి ఉండగా లావణ్య త్రిపాఠి మాత్రం ట్రెండీ వేర్ లో చాలా క్యూట్ గా కనిపించారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత మొదటిసారి తన భర్తను పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ దంపతులపై ప్రశంసలు కురిపిస్తూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక వరుణ్ తేజ్ ఈ పెళ్లి వేడుకలని ముగించుకున్న వెంటనే తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.ఇక పెళ్లి తర్వాత లావణ్య కూడా సినిమాలలో నటించబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
పెళ్లి జరిగినప్పటికీ సినిమాలలో నటించడానికి మెగా ఫ్యామిలీ తనకు ఏ విధమైనటువంటి అభ్యంతరం చెప్పలేదని అయితే తను ఎలాంటి సినిమాలలో నటించిన ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే విధంగానే ఉండాలని లావణ్యకు ముందుగానే హెచ్చరించినట్టు సమాచారం.