టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితికి రాజమౌళి కారణం.. వర్మ సంచలన వ్యాఖ్యలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలుగుతున్న డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు జక్కన్న రాజమౌళి పేరు సమాధానంగా వినిపిస్తుంది .ఊహలకు అందని సన్నివేశాలతో సినిమా తెరకెక్కించి ఆ సినిమాతో సక్సెస్ సాధించడం జక్కన్నకు మాత్రమే సాధ్యమైందనే సంగతి తెలిసిందే.

 Varma Sensational Comments About Rajamouli Details Here Goes Viral , Rajamouli-TeluguStop.com

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న టాలీవుడ్ సినిమాలు అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి.

అయితే టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితికి రాజమౌళి కారణమంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.వర్మ జక్కన్నపై చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి రెండు పనులు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.

అందులో ఒకటి సినిమాను బాగా తెరకెక్కిస్తే వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రూవ్ చేయడమని రెండవది సినిమా కలెక్షన్లు, క్వాలిటీ విషయంలో రికార్డులు క్రియేట్ చేయడమని వర్మ అన్నారు.

వాటి ముందు మిగతా సాధారణ సినిమాలు నిలవలేకపోతున్నాయని వర్మ అభిప్రాయపడ్డారు.అందువల్ల టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు అంతా రాజమౌళి కంటే ఎక్కువ బడ్జెట్ తో సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నారని వర్మ చెప్పుకొచ్చారు.

Telugu Otts, Rajamouli, Ram Goapl Varma, Theaters, Tollywood, Varma-Movie

ఈ కారణం వల్లే సినిమాల బడ్జెట్ పెరిగిపోయిందని వర్మ కామెంట్లు చేశారు.ప్రస్తుత పరిస్థితిలో థియేటర్ల సమస్యలు, ఓటీటీలు అసలు సమస్యలు కాదని రాజమౌళి, యూట్యూబ్ అసలు శత్రువులని వర్మ పేర్కొన్నారు.వర్మ చేసిన కామెంట్లు నిజమేనని మరి కొందరు చెబుతున్నారు.భారీ సినిమాలను చూసిన ప్రేక్షకులు సాధారణ సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించడం లేదు.రామ్ గోపాల్ వర్మ కామెంట్ల గురించి రాజమౌళి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube