తమిళం, తెలుగులో వారసుడు మూవీ డిజాస్టర్.. దిల్ రాజు పరిస్థితి ఏంటంటే?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వారసుడు మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించడం లేదు.

 Varasudu Movie Result In Telugu Tamil Languages Details Here Goes Viral , Walthe-TeluguStop.com

తమిళంలో ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకూ తగ్గుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు ఆశాజనకంగా పరిస్థితులు అయితే లేవు.

ఆదివారం రోజున ఈ సినిమా బుకింగ్స్ ను పరిశీలిస్తి చాలా థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎక్కువగా లేదు.

అయితే వారసుడు మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా దిల్ రాజుకు నష్టం లేదని బోగట్టా.

దిల్ రాజు ఈ సినిమా తమిళ హక్కులు ముందుగానే అమ్మేయడంతో ఈ సినిమాకు నష్టాలు వచ్చినా దిల్ రాజుపై ఆ భారం పెద్దగా ఉండదని సమాచారం.తెలుగునాట వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు విజయవంతంగా ప్రదర్శించబడుతూ ఉండటం వారసుడు సినిమాకు మైనస్ అయింది.

సంక్రాంతి పండుగ సమయంలో కాకుండా మరో సమయంలో ఈ సినిమా విడుదలై ఉంటే మాత్రం ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.వారసుడు మూవీ రిలీజ్ విషయంలో దిల్ రాజు లెక్క తప్పింది.తెలుగులో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ఈ సినిమాకు మరో విధంగా మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వారసుడు సినిమా తెలుగు, తమిళ భాషల్లో సాధించిన కలెక్షన్ల కంటే సంక్రాంతికి విడుదలైన తెలుగు సినిమాలు ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు సాధిస్తున్నాయి.దిల్ రాజు తెలుగు హీరోలను నమ్ముకుంటే బెటర్ అని కొంతమంది సూచనలు చేస్తున్నారు.వారసుడు సినిమాకు పైరసీ కూడా భారీ నష్టాలను మిగిల్చింది.

వారసుడు తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లో విజయ్ పాల్గొనకపోవడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube