షాకింగ్ న్యూస్ చెప్పిన వెర్సటైల్ స్టార్.. క్రాక్ నటి అలా చెప్పడంతో..

వరలక్ష్మి శరత్ కుమార్.ఈమె ఇటీవల కాలంలో చాలా పాపులర్ అయినా సౌత్ ఇండియన్ వెర్సటైల్ నటి.సౌత్ ఇండియాలో హీరోయిన్స్ రోల్స్ లో మాత్రమే కాకుండా విలన్ రోల్స్ లో కూడా మెప్పించి హీరోయిన్ రేంజ్ స్టార్ డమ్ అందుకున్న నటీమణులు కూడా ఉన్నారు.అయితే వీరిలో టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ అనే చెప్పాలి.

 Varalaxmi Sarath Kumar Tested Positive For Covid-19, Covid-19, Varalaxmi Sarath-TeluguStop.com

ఈమె విలన్ పాత్రల్లో నటించి తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించు కుంది.

ఈమె అందరి నటీమణుల కంటే ట్రెండింగ్ లో ఉంటుంది.

మన టాలీవుడ్ లో కూడా ఈమెకు స్పెషల్ గుర్తింపు ఉండడంతో మన డైరెక్టర్లు ఈమెకు స్పెషల్ రోల్ కూడా క్రియేట్ చేసి మరీ ఈమెను తమ సినిమాల్లో భాగం చేసుకుంటున్నారు.ఈమె ఎలాంటి పాత్ర అయినా తన నటనతో చేసి చూపించ గలదు.

క్రాక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేసి సూపర్ అనిపించింది.

క్రాక్ సినిమా హిట్ తో ఈమెకు గోపీచంద్ మలినేని మరొక అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు.

ప్రెసెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

అయితే ఇటీవలే బాలయ్యకు కరోనా రావడంతో ఈ సినిమా షెడ్యూల్ వాయిదా వేశారు.

ఇక బాలయ్యకు తగ్గింది అని అనుకుంటే ఈసారి వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమెకు కరోనా సోకడంతో ఆమె పని చేసిన సినిమా టీమ్ అంతా కూడా భయపడుతున్నారు.

మరి తోటి నటులంతా ఈమెకు తొందరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నారు.

https://twitter.com/varusarath5/status/1548509914456150016?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1548509914456150016%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-37400005471298275615.ampproject.net%2F2206221455000%2Fframe.html
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube